ముఖ్యాంశాలు
Kura Yadaiah| January 29,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :

మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సభలు సమావేశాలు ఊరేగింపుల అనుమతి కోసం తప్పనిసరి డిఎస్పి పర్మిషన్ తీసుకోవాలని తాండూర్ డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య తెలిపారు….
DSP|తాండూర్: ఎన్నికల కమిషన్ జారీ చేసిన మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో అధ్యక్షులు పబ్లిక్ మీటింగ్లకు ర్యాలీలకు ఊరేగింపులకు లౌడ్ స్పీకర్ల కోసం తప్పనిసరి అనుమతి తీసుకోవాలని తాండూర్ డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య తెలిపారు. ఒకవేళ అనుమతి తీసుకోదలచిన వారు 48 గంటలకు ముందుగానే లౌడ్ స్పీకర్ల కోసం తాండూర్ డిఎస్పి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు వారి ఎన్నికల ప్రచార వాహనాలకు సంబంధించిన అనుమతి కోసం మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ను అధికారుల అనుమతి తీసుకోకుండా ఉంటే అభ్యర్థులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
