ముఖ్యాంశాలు,
Kura Yadaiah January 19,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :


తాండూర్ మున్సిపల్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రావడానికి కారణం తాండూరు బీసీ సంఘం చేసిన పోరాట ఫలితమేనని జాతీయ బీసీ సంఘం అగ్రనేత కందుకూరి రాజ్ కుమార్ అన్నారు……..
Kandukuri Rajkumar| తాండూర్ : తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రావడానికి తాండూర్ బిసి సంఘం చేసిన పోరాట ఫలితమే ఈరోజు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్యాయని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన మున్సిపల్ రిజర్వేషన్లను తాండూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ జనరల్ కు కేటాయించడం హర్షించదగ్గ విషయమే, అలాగే మొత్తం 36 వార్డులకు గాను 15 వార్డులు బీసీలకు రిజర్వ్ చేయడం ఇది చారిత్రాత్మక నిర్ణయం అని దీని వెనుక తాండూరు బిసి సంఘం నేతలు బీసీల ఉద్యమ పోరాట ఫలితాలేమని రాజకుమార్ పేర్కొన్నారు.
అనేక సంవత్సరాల బిసి నాయకుల పోరాట ఫలితం ,
అనేక సంవత్సరాలుగా తాండూరులో బీసీల హక్కుల కోసం బీసీల అభివృద్ధి సంక్షేమం రాజకీయాలలో బీసీలవాటకై పోరాటం చేస్తూ వస్తున్నాము. ఈ పోరాటం నేడు ఫలించిందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కేవలం బీసీలకు 18 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉన్నప్పటికీ తాండూర్ గడ్డపైన బీసీలు 69 సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడం వెనుక కూడా తాండూర్ బీసీ సంఘం చేసిన పోరాటాలు బీసీలలో చైతన్యాన్ని కలిగించాలని అన్నారు. తాండూర్ లో బీసీలకు అగ్రస్థానం కల్పించినందుకుగాను ఒకపక్క ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే కేటాయించిన బీసీలకు కేటాయించిన సీట్లలో తప్పకుండా బీసీలు విజయం సాధించాలని ఆ దిశగా బీసీ సోదరులు మిగతా వర్గాల నాయకులు సహకరించాలని రాజ్కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తాండూర్ బీసీ సంఘంపై మరింత బాధ్యత పెరిగింది,
దీని ద్వారా తాండూరు బీసీ సంఘంపై మరింత బాధ్యత పెరిగిందని తప్పకుండా బీసీల హక్కుల సాధన కోసం బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావడానికి వెనకాడబోమని ఆయన అన్నారు.
