ముఖ్యాంశాలు
Kura Yadaiah| January 23,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :

వేగం చాలా ప్రమాదకరమైందని ప్రాణం చాలా విలువైందని ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సురక్షితమైన గమన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే కుటుంబాన్ని వీధిపాలు చేసుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు…..
Sp Vikarabad |తాండూర్ :వేగం చాలా ప్రమాదకరమైందని ప్రాణం చాలా విలువైందని రోడ్డు ప్రమాదాల బారిన పడితే కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడుతుందని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా అన్నారు. శుక్రవారం రోజు తాండూర్ స్థానిక ఆర్యవైశ్య కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన అలైవ్ అరైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
రోడ్డు ప్రమాదాలు కేవలం ఒక ప్రాణాన్ని తీయడమే కాదు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా ,
రోడ్డు ప్రమాదాలు కేవలం ఒక ప్రాణాన్ని తీయడమే కాకుండా ఆ కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేస్తాయని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా కుటుంబ పెద్దలను కోల్పోయిన ఇల్లు ఆర్థికంగా సామాజికంగా అనేక రకాలుగా చిటికపోయి నష్టాలకు దారి తీస్తాయని ఆమె పేర్కొన్నారు. 2026 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు కనిష్ట స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ లక్ష్యసాధనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎస్పీ చెప్పారు.

వేగం కన్నా ప్రాణం మిన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,
వాహనదారులు అతివేగం నియంత్రించుకోవాలని వేగం కంటే ప్రాణం మిన్న అని నినాదాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ప్రజలను కోరారు. యువత హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ పెట్టుకోవడం వంటి ప్రాథమిక నియమాలను తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని రోడ్డు భద్రత నియమాలను పాటించడం అనేది భయం వల్ల కాకుండా బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. సెల్ఫోన్ డ్రైవింగ్ మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకం అని ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు.

కార్యక్రమంలో తాండూర్ డిఎస్పి ఎన్ యాదయ్య టౌన్ ఇన్స్పెక్టర్ సంతోష్ తరుణ్ కోట్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ ప్రసాద్ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
