రాజకీయం
Kura Yadaiah January 16/2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :

ఎల్లంపేట మున్సిపల్ రిజర్వేషన్లలో బీసీలకు తీవ్ర అన్యాయం ప్రకటించిన రిజర్వేషన్లపై పునర్విచారణ జరిపి బీసీలకు న్యాయం చేయాలని మున్సిపల్ కమిషనర్కు బీసీ సంఘాలు వినతిపత్రం ఇచ్చాయి….
మేడ్చల్:మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో రిజర్వేషన్ల లలో బిసీలకు అన్యాయం చేశాయని ప్రభుత్వ ఆధార బాధరగా మున్సిపల్ ఎన్నికలు జరపకుండా రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్కు బీసీ సంఘాలు శుక్రవారం రోజు వినతిపత్రం ఇచ్చాయి. ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన అయిదు ఇవ్వగా మరియు ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన నాలుగు వార్డులు కేటాయించి బీసీలకు మాత్రమే డెడికేటెడ్ కమిషన్ ప్రతిపాదికన కేవలం 3 వార్డులు కేటాయించడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బిసి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మున్సిపల్ రిజర్వేషన్లను పరిశీలించి బీసీలకు సమన్వయం జరిగేలా చూడాలని లేనియెడల కోర్టు ద్వారా న్యాయపరంగా కొట్లాడుతామని బీసీ సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో ముదిరాజు రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు దుబ్బ కోటి ఆంజనేయులు, మాజీ సర్పంచులు పోచయ్య ముదిరాజ్ జిన్నారం కృష్ణ రవిచంద్ర మాజీ సొసైటీ డైరెక్టర్ జీడిపల్లి భూపాల్ దాది రమేష్ అంజయ్య కోరి పత్తి రమేష్ ముదిరాజ్ రవీందర్ నాగేష్ సత్యనారాయణ రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
