సంక్షేమం,
K, Yadaiah |August 13,2025,
Hindu 9 news,

ఆగస్టు 16 న ,తాండూర్ లో వికలాంగులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళల పెన్షన్ విధానం పై నిర్వహిస్తున్న సభకు తరలిరావాలని ఎమ్మార్పీఎస్ పెద్దోళ్ళ ఆనంద్ కుమార్ కోరారు…..
Pension|యాలాల్: ఆగస్టు 16 తారీకు రోజున ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వికలాంగుల వృద్ధుల వితంతువుల ఆత్మబంధువు డాక్టర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో తాండూర్ గగరాణి ఫంక్షన్ హాల్ లో నిర్వహించబోయే అన్ని రకాల పింఛన్ సభకు వికలాంగులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పెద్దోళ్ల ఆనంద్ కుమార్ కోరారు.
గురువారం రోజు యాలాల్ మండలం రాఘపూర్ గ్రామంలో వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలతో ఆనంద్ కుమార్ సమావేశమై పెన్షన్ పెంపు విధానం పై చర్చించి పెన్షన్ పొందుతున్న వారందరూ 16 తారీఖున తాండూర్ కు రావాలని ఆనంద్ కుమార్ వారికి తెలిపారు .వికలాంగులకు 6000, వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ₹4,000 పెన్షన్ పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 16 తారీఖున తాండూర్లో సభ నిర్వహిస్తున్నమని ఈ సభకు ముఖ్య అతిథిగా గౌరవ ఉద్యమ యోధులు మందకృష్ణ మాదిగ విచ్చేస్తున్నారని తెలిపారు. తాండూర్ నియోజకవర్గంలో ఉన్న వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరు ఈ సభకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు.

కార్యక్రమంలో పద్మావతి బాలమణి వడ్డే లక్ష్మమ్మ బి నర్సింలు రాములు బాలప్ప తదితరులు పాల్గొన్నారు.
