సామాజిక
Kura Yadaiah January 4,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :-


వికారాబాద్ జిల్లాలోనే తాండూర్ నియోజకవర్గంలో 67 మంది బీసీ సర్పంచులు గెలుపొంది తాండూరును మొదటి స్థానంలో నిలపడంలో బీసీల ఐక్యత సాధించినట్లేనని, జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు…
BC moment// తాండూర్:- వికారాబాద్ జిల్లా తాండూర్ లో గత సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు ఎక్కువ శాతం, అంటే 67 మంది సర్పంచులుగా గెలుపొంది బీసీల ఐక్యతను చాటి చెప్పామని ఇది రాబోయే స్థానిక ఎన్నికలకు శుభసూచకంగా భావిస్తామని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం రోజు తాండూర్ నియోజకవర్గంలో గెలుపొందిన వివిధ మండలాలు పెద్దేముల్ యాలాల్ బషీరాబాద్ తాండూర్ బీసీ సర్పంచులను జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి గెలుపొందిన సర్పంచులను ఘనంగా సత్కరించారు.

తాండూర్ నియోజకవర్గంలోనే బీసీ సర్పంచులు ఈ స్థాయిలో గెలుపొందడం అభినందనీయమని తాండూర్ బీసీ సమాజానికి ఇదొక మంచి శుభ పరిణామమని భవిష్యత్తులో బీసీలు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కూడా గెలవాలని ఆకాంక్షించారు. తమపై ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచిందని తప్పకుండా బీసీల ఆత్మగౌరవం హక్కుల కోసం తాండూరు ప్రాంతంలో బీసీలకు అండగా నిలబడతానని అన్నారు. జనరల్ స్థానాలలో కూడా బీసీలు పోటీ చేసి గెలుపొందడం గొప్ప పోరాటమేనని ఆ బీసీల పోరాటాన్ని వారి త్యాగాన్ని బీసీలు ఎవరు కూడా మరువకూడదని అన్నారు.

ఇది బీసీల ఐక్యతను చాటి చెప్పడమే గెలిచిన సర్పంచులు రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి, వక్తల పిలుపు,
అలాగే సభకు ముఖ్య వ్యక్తులుగా విచ్చేసిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పిజి మధుసూదన్ రావు ప్రముఖ వైద్యులు డాక్టర్ జయప్రసాద్ రామకృష్ణ లు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వివిధ కులాల వారీగా ఉన్న బీసీలను ఒక తాటిపాయికి తీసుకువచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తాండూర్ బీసీ సంఘం నాయకులకు చెల్లిందని దాన్ని ముందుండి నడిపిస్తున్న రాజ్ కుమార్ కే దక్కుతుందని వక్తలన్నారు . బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసి బీసీ ప్రజలకు బిసి యువతకు అండగా నిలబడాలని ముఖ్య అతిథులుగా పాల్గొన్న వ్యక్తులు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కూడా బీసీలకు అండగా నిలబడాలని తాండూర్ లో ఉన్న బీసీలుగా రాజ్ కుమార్ కు సపోర్టుగా ముందుగా ఉంటామని పేర్కొన్నారు. జడ్పిటిసి ఎంపిటిసి మున్సిపల్ కౌన్సిలర్ స్థానాల్లో కూడా బీసీలు అధిక స్థానాలలో గెలిచి బీసీల నినాదాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. గెలిచిన సర్పంచులంతా భారత రాజ్యాంగం హక్కులను తెలుసుకోవాలని గ్రామాల అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం తెలుసుకోవడంలో ఒక గొప్ప పరిణితిని సాధించినట్లేనని వారన్నారు. తాండూరు నియోజకవర్గంలో అన్ని మండలాలలో కలిపి 67 మంది బీసీ సర్పంచులు విజయం సాధించారని వారిని ఈనాడు రాజ్ కుమార్ గొప్పగా సత్కరించడం బీసీ సమాజాన్ని సత్కరించడమేనని అన్నారు. కార్యక్రమంలో సుకూర్ వెంకటేష్ విజయేందర్ రాజు అనిత మంజుల గోపాల్ దిలీప్ సింగ్ పండరి రాజ్కుమార్ భార్గవి నరేందర్ లక్ష్మణ చారి బసంత్ కుమార్ బసవరాజ్ రాము ముదిరాజ్ పరమేశ్ దుబాయ్ వెంకట హరిప్రసాద్ పండుగౌడ్ నరసింహ జగదీశ్వరి మధులత శివ లీల విజయలక్ష్మి రాజు కృష్ణ కమలాకర్ అరుణ్ రాజ్ అలటి శ్రీనివాస్ నవీన్ టైలర్ రమేష్ గోపాల్ నర్సింలు దవులయ్య తదితరులు పాల్గొన్నారు.
