పోలీస్ రిక్రూట్మెంట్ లో- వికలాంగులకు రిజర్వేషన్ అనేది చారిత్రాత్మకమే!-రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య,

దివ్యాంగులు

Kura yadaiah

హిందు 9 న్యూస్ బ్యూరో :

Reservation| పోలీస్ రిక్రూట్మెంట్లో వికలాంగులకు రిజర్వేషన్ అనేది చారిత్రాత్మక అంశమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మృతినేని వీరయ్య తెలిపారు….

Reservation|హైదరాబాద్ :ఇకనుండి పోలీస్ శాఖలోకి వికలాంగులు పోలీస్ రిక్రూట్మెంట్  వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. రిజర్వేషన్ అమలుకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అధికారులకు పోలీస్ శాఖలో రిజర్వేషన్ అమలు పరిచేందుకు సిద్ధమైన సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ,కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం అధ్యక్షులు ముత్తినేని వీరయ్య తెలిపారు.

గత పది సంవత్సరాల నిరీక్షణ ఫలించింది, గత 10 ఏండ్లలలో కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు,

గత 15 సంవత్సరాలలో ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగంతో కలుపుకొని వికలాంగుల జేఏసీ అనేక ఉద్యమాలు పోరాటాలు గతంలో చేసిందని రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాలని 2017 లో ఆనాటి కెసిఆర్ ప్రభుత్వంతో అనేక ఉద్యమాలకు పోరాటాలకు పూనుకున్నామని పేర్కొన్నారు. ఇందులో పట్టబద్రుల కృషి కూడా చాలా అమోఘమని అయితే ఆనాడు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ అయిన తర్వాత వికలాంగుల సంక్షేమంలో అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చామని దాంట్లో భాగంగానే పోలీస్ రిక్రూట్మెంట్ లో కూడా రిజర్వేషన్ అమలుపరచడానికి ప్రభుత్వం ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. ఇది సంతోషించాల్సిన అంశమని ఏనాటి నుండో తీరని సమస్య నేడు తీరబోతున్నందుకు ఆనందంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులు తమతో చర్చించినప్పుడు ఈ విషయము రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి దృష్టికి తీసుకెళ్లాము వారు సానుకూలంగా స్పందించారని త్వరలో రిజర్వేషన్ అమలు చేయడానికి ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఇకమీదట సంక్షేమంలో అనేక జీవోలను కూడా ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు తెలిపారు.

 

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *