అన్నదమ్ముల ఇద్దరి మధ్య ఇంటి స్థలం గొడవ.! తమ్ముడుపై అన్న కత్తితో దాడి తమ్ముడు అక్కడికక్కడే మృతి, ఘటన స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు,

author
0 minutes, 1 second Read

క్రైమ్ 

Kura Yadaiah January 18,2025,

హిందు 9 న్యూస్ బ్యూరో ;

తాండూర్ పట్టణం మానిక్ నగర్లో అన్నదమ్ముల ఇద్దరి మధ్య ఇంటి స్థలం గొడవ జరిగింది ఈ గొడవలో అన్న  తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. అక్కడికక్కడే రెహమాన్ అనే వ్యక్తి  మృతి చెందాడు విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి  చేరుకొన వివరాలను సేకరిస్తున్నారు……

తాండూర్ :-  వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం మాణిక్ నగర్లో ఇంటి స్థలం  అన్నదమ్ముల ఇద్దరి మధ్యన వివాదాన్ని రెపింది. చివరకు చినికి చినికి గాలివానగా మారి హత్యకు దారి తీసిన విషాద ఘటన పట్టణంలో చోటు చేసుకోవడం కలకాలం రెపింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ మున్సిపల్ పరిధిలోని మాణిక్ నగర్ ప్రాంతానికి చెందిన మోసిన్ రెహమాన్ వీరిద్దరూ అన్నదమ్ములు రెహమాన్ ఉపాధి కోసం హైదరాబాదులో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా  ఇంటి స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఇటీవల తమ్ముడు రెహమాన్ ను ఇంటి స్థలం విషయంలో మాట్లాడుకుందామని అన్న మోసిన్ పిలిపించినట్లు తెలుస్తుంది .ఈ విషయంలోనే మాట్లాడుకుంటున్న సమయంలోనే మాట మాట పెరిగి అది ఘర్షణగా మారి ఆగ్రహానికి లోనైన మోసిన్ తమ్ముడు రెహమాన్  పై కత్తితో దాడి చేశాడు.

దాంతో తీవ్ర రక్తస్రావం కావడంతో రెహమాన్ అక్కడికక్కడే మృతి  చెందినట్లు తెలుస్తుంది. ఈ ఘటన అక్కడే నివాసం ఉంటున్న స్థానికుల్లో కొంత భయాందోళనలకు గురిచేసింది. అత్యా సమాచారం తెలుసుకున్న తాండూర్ డిఎస్పీ నర్సింగ్ యాదయ్య సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలను సేకరిస్తున్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *