ముఖ్యాంశాలు,
Kura Yadaiah |February 28,2026,
హిందు 9 న్యూస్ :


-రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతగిరి పర్యటన, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి,
-భద్రత పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు, ప్రజలకు ఇబ్బంది కలుగొద్దు, ఎస్పి శ్రీమతి స్నేహమెహ్రా,
మార్చ్ 2 తారీకు రోజున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా అనంతగిరి పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ కార్యాలయంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు…
హిందు 9 న్యూస్ ( వికారాబాద్ ,28)మార్చ్ 2 తారీకున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతగిరి పర్యటనకు వస్తున్న సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా శనివారం రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
విఐపి ల పర్యటన ఉంటున్న సందర్భంగా పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు బందోబస్తు పై భద్రత ఏర్పాట్లపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై జిల్లా పోలీసు అధికారులతో సుదీర్ఘంగా ఆమె చర్చించారు.
రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యున్నత స్థాయి భద్రతను ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసు అధికారులను ఆమె ఆదేశించారు.
జరిగిన పోలీసు అధికారుల సమావేశంలో భాగంగా ఎస్పీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బందోబస్తుకు పూర్తి ప్రణాళికను పోలీసులకు వివరించారు.
ఎలిప్యాడ్ వద్ద భద్రత కాన్వాయ్ ప్రయాణించే రూట్ మ్యాప్ సభా ప్రాంగణం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.
పర్యటన సాగే మార్గాలలో ముందస్తుగా తనిఖీలు చేపట్టాలని ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు తాళిత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ప్రతి పోలీస్ అధికారి అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పని చేయాలని ఆమె స్పష్టం చేశారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యటన ప్రశాంతంగా ముగిసేలా పటిష్టమైన గట్టి భద్రత ఏర్పాట్లు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులకు చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ బి రాములు నాయక్ పరిగి డిఎస్పి శ్రీనివాస్ వికారాబాద్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి తాండూర్ ఇన్చార్జి డిఎస్పి శ్రీనివాసులు డిసిఆర్బి డిఎస్పి జానయ్య ఏఆర్డిఎస్పి వీరేష్ సిఐలు ఆర్ఐలు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
