ప్రజా సమస్యల పరిష్కారానికే, మా మొదటి ప్రాధాన్యత, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా,

ముఖ్యాంశాలు 

Kura Yadaiah| January 31,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

-ప్రజా సమస్యల పరిష్కారానికే మా ప్రాధాన్యత,

-ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించి, విచారణను వేగవంతం చేయాలి,

-జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి మంగళవారం ,గురువారం ప్రజావాణి కార్యక్రమం,

Sp Vikarabad : వికారాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి మా మొదటి ప్రాధాన్యత ఉంటుందని ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే విచారణ చేపట్టి పరిష్కరించాలని ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు….

హిందు 9 న్యూస్  (వికారాబాద్ ):జిల్లా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం ఎజెండగా పోలీస్ శాఖ పనిచేస్తుందని సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు. శనివారం రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా ఫిర్యాదు దారులతో ముఖాముఖి సమావేశమై మాట్లాడారు. జనవరి నెలలో ఇప్పటివరకు మొత్తం 52 ఫిర్యాదులు తమకు అందినట్లు ఎస్పి స్పష్టం చేశారు. జిల్లా మొత్తం నుండి బాధితుల నుంచి సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ వారు సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన ఉద్దేశం అని వారికి హామీ ఇచ్చారు. తమ దృష్టికి వచ్చిన సమస్యల ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు బదిలీ చేస్తూ నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించి నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలు భద్రత శాంతిభద్రతల కోసం జిల్లా ఎస్పీ తో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆమె పేర్కొన్నారు.

-వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి మంగళవారం గురువారం ప్రజావాణి కార్యక్రమం,

వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి మంగళవారం, గురువారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా క్లిష్టమైన ప్రతికూల ఫిర్యాదులను నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చునని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కార్యాలయానికి వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వారి సమస్యలను ఓపిగ్గా విని ఫిర్యాదుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదు పై తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని ముఖ్యంగా మహిళలు వృద్ధులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.

ప్రజలకు పోలీసు వ్యవస్థపై పూర్తిగా నమ్మకం కలిగేలా పారదర్శకమైన సేవలు అందించి శాంతిభద్రతల విషయంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని ప్రజల భాగస్వామ్యం కూడా అధికారులు కోరాలని తెలిపారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *