ప్రభుత్వం
Kura Yadaiah|November 21,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :

Road work| పోలీస్ అకాడమీ చేవెళ్ల మన్నేగూడ జాతీయ రహదారి రోడ్డు పనులను వేగవంతం చేయండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రోజు అధికారులను ఆదేశించారు……
Road work CM revanth Reddy |హైదరాబాద్: పోలీస్ అకాడమీ నుండి చేవెళ్ల వాయ మన్నెగూడ రహదారి రోడ్డు పనులను వేగవంతం చేయాలని శుక్రవారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు విత్ డ్రా
అయితే రోడ్డు వెంబడి ఉన్న చెట్లపై గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసిన నేపథ్యం ఉండడం వల్ల ట్రిబ్యునల్ లో కేసును వేసిన ప్రతినిధులు కేసు విత్ డ్రా చేసుకున్నందున తక్షణమే రోడ్డు పనులను వేగవంతం చేసే ప్రజలకు సురక్షితమైన రవాణా కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్ ట్రిబ్యునల్ లో చెట్లపై కేసు వేసిన ప్రతినిధులు ముఖ్యమంత్రిని శుక్రవారం రోజు కలిసిన నేపథ్యంలో వారిని తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిగి తాండూర్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి మనోహర్ రెడ్డి కలిసి ట్రిబ్యునల్ కేసు విత్ డ్రా చేసుకున్న వారిని సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.

ఉన్న 954 చెట్లను పరిరక్షించాలన్న ముఖ్యమంత్రి,
ప్రస్తుతం రోడ్డు వెంబడి ఉన్న 954 చెట్లను ఎట్టి పరిస్థితుల్లో పరిరక్షించే విధంగా చూడాలని అన్నారు.అలాగే రోడ్డును యుద్ధ ప్రాతిపదికపై నాణ్యతతో కూడిన రోడ్డును నిర్మించాలని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
