నవీన్ యాదవ్ గెలుపుకు- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తుగడలు వ్యూహాలు సక్సెస్ అయినట్టేనా!

author
0 minutes, 1 second Read

ఎన్నికలు –వ్యాసాలు

Kura Yadaiah|16, November 2025

హిందు 9 న్యూస్ ఎడిటోరియల్:

Riding :

జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిశాయి. బి ఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 25 వేల మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపుకు అనేక  ఎత్తుగడలు వ్యూహాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు  ఆయా సామాజిక వర్గాల ఓట్లను దగ్గర చేసుకునేందుకు సామాజిక వర్గాల వారీగా బాధ్యతలు అప్ప చెప్పడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. మంత్రులు కూడా సామాజిక వర్గాల వారీగా సమావేశాలు సభలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కూడా డివిజన్ల వారీగా బస్తిలవారీగా ఎన్నికల  సభల్లో పాల్గొంటూ ప్రజలకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పథకాలను విరివిగా ప్రచారం చేయడం బిఆర్ఎస్ బిజెపి ఒకటేనని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర వహించారు. దానికి తోడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులను సమన్వయం చేయడంలో ఇతర పార్టీలను సమన్వయం చర్చించడం కూడా  గెలుపుకు కారణమే అని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు పార్టీ ఎత్తుగడలు నాయకులకు వివరిస్తూ ముందు కదిలిన నైజం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ది.మరో పక్క చిన్న శ్రీశైలం యాదవ్ పేరు అందరికీ సుపరిచితమే శ్రీశైలం యాదవ్ మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి గత నేపథ్యం ఎలా ఉన్న ఇప్పుడు శ్రీశైలం యాదవ్ కు సినీ పరిశ్రమ వాళ్ళతో మంచి సత్సబంధాలు ఉన్నాయి. ఈచిన్న శ్రీశైలం యాదవ్ కొడుక్కే నవీన్ యాదవ్, నవీన్ యాదవ్ గెలుపుకు తండ్రి శ్రీశైలం యాదవ్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఎందుకంటారా? సినీ పరిశ్రమ వాళ్ళతో మంచి సంబంధాలు కలిగి ఉండడం వారికి ఆర్థిక లావాదేవీలలో సపోర్ట్ చేయడం సినీ పరిశ్రమకు అండగా నిలబడడం ఈ గెలుపుకు కలిసొచ్చిన అంశమే  జూబ్లీహిల్స్ అనంగానే సినీ పరిశ్రమ నేతలు కార్మికులు పరిశ్రమ నిర్మాతలు అందరూ ఉండేది అక్కడే కాబట్టి వారికి ఎప్పుడు ఆర్థికంగా సపోర్టుగా నిలిచిన చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ గెలుపుకు శ్రీశైలం యాదవ్ సహకారం బలం బలగం కలిసొచ్చిన అంశమే. మరొక అంశం ఏమిటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మికురులతో ప్రత్యేక సమావేశం బహిరంగ సభ ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించడానికి నేను ముందుంటానని తప్పకుండా నవీన్ యాదవ్ ను గెలిపిస్తే సినీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం అంటూ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం కూడా సినీ పరిశ్రమ ఓట్లు నవీన్ యాదవ్ కు పడడంలో ఎలాంటి అనుమానం లేదు.

కమ్మ ఓట్లను నవీన్ యాదవ్ వైపు మళ్ళించడంలో ముఖ్యమంత్రిదే కీలకపాత్ర,

జూబ్లీహిల్స్ అనగానే కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఏరియా ఒకప్పటి తెలుగుదేశం పార్టీ కంచుకోట కూడా జూబ్లీహిల్స్ అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఏరియా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకపోవడం కలిసి వచ్చిన అంశం ఒకవైపు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావడం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అక్కడ కమ్మ సామాజిక వర్గంతో మంచి సంబంధాలు కలిగి ఉండడం చంద్రబాబు శిష్యుడిగా పేరు ఉండడం కూడా ఈ ఎన్నికల్లో కలిసి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటే కమ్మ సామాజిక వర్గానికి కూడా కలిసి వచ్చిన అంశం అని చెప్పుచు ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం వివిధ వ్యాపారాలలో స్థిరపడిపోయిన వర్గం కాబట్టి తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వ్యక్తి కావడం చంద్రబాబు వద్ద రేవంత్ రెడ్డికి మంచి పేరు ఉండడం అక్కడున్న కమ్మ సామాజిక వర్గానికి ఒక నమ్మకం కాబట్టి కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా అధికంగా నవీన్ యాదవ్ కి పడ్డాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ముస్లిం ఓటర్లపై ముద్రవేసిన అజారుద్దీన్ మంత్రి పదవి,

ఉప ఎన్నికల ముందు ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తుగడ సక్సెస్ఫుల్గా పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం క్యాబినెట్లోకి తీసుకోవడం తదనంతరం ప్రమాణ స్వీకారం చేయించడం వెంటనే నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి సక్సెస్ అయ్యారు. దాంతో  ముస్లిం ఓట్ బ్యాంకు ను తమ వైపు తిప్పుకోవడంలో  రేవంత్ రెడ్డి తనకు తానే సాటి.

అందెశ్రీ పాడే మోయడం మానవత విలువలను చాటి చెప్పడమే,

ఉమ్మడి రాష్ట్రం ,తెలంగాణ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని పని సాహసం మానవీయ అంశం మానవత విలువలతో కూడిన అంశం ఏదైనా ఉందంటే అది ప్రముఖ కవి అందెశ్రీ పాడే మోయడం యావత్తు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కళాకారుల కవుల తెలంగాణ సమాజాన్ని నివ్వెర పోయేలా చేసింది. తనకున్న భద్రత అధికారాన్ని కొంతసేపు పక్కన పెట్టి ఒక ప్రముఖ కవి  పేద వర్గాల నుండి వచ్చి సామాజిక వర్గాల నేపథ్యం కలిగిన అందెశ్రీ లాంటి భౌతిక గాయాన్ని తాను మోయడం ఒక సంచలనం సృష్టించింది.  గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని చరిత్రత్మకమైన మానవీయ విలువలతో కూడిన అంశమే, ఎందుకంటే ఇప్పుడున్న ఈ కాలంలో కన్న కొడుకులు కూడా కనుక్కున్న తల్లిదండ్రులను ఆశ్రమాల్లో లేదా ఆస్తుల కోసం రోడ్డుమీద వదిలేసిన సందర్భాలను చూసినం. కానీ తెలంగాణ జనగీతం రాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ జాతీయ గీతం గా మలుచుకొని మనసు నిండా నిండిపోయేలా చేసాడు అందెశ్రీ. అందెశ్రీ అందెశ్రీ అంటే అపారమైన గౌరవం అపారమైన నమ్మకం అందుకే అందెశ్రీ పాడెను మోసి కవులకు కళాకారులకు మా ప్రభుత్వంలో ఈ స్థానం ఉంటుందని గుర్తు  చేశారు. ఈ విషయం తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వ్యక్తిత్వాన్ని గొప్పతనాన్ని తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసింది.ఉప ఎన్నికల వేల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గౌరవ మర్యాదలు పెరగడం అది ఎన్నికల్లో కూడా ప్రభావం చూపింది. ఈ విషాద వార్తను కొంతసేపు పక్కన పెడితే. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలంటే కొంతసేపు అధికారాన్ని అధికార దర్పాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడమే కాంగ్రెస్ పార్టీకి కలిసి రావడం,

ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణలో నిత్యం రగులుతున్నఅంశం ఈ సందర్భంలో ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడంలో ముఖ్యమంత్రిగా ఎత్తుగడ. అన్ని రకాల బలబలాలు అంచనా వేసుకుని నవీన్ యాదవ్ లాంటి వ్యక్తిని ఉప ఎన్నికల్లో నిలబెట్టడం కాంగ్రెస్ పార్టీకి గెలుపును కట్టబెట్టింది. వీటన్నిటిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మంచి ఎత్తుగడలు వ్యూహాలు రచించి గెలుపొందడంలో సక్సెస్ అయ్యారు. అనేది విశ్లేషకుల అంచనగా అభిప్రాయాలుగా వినిపిస్తున్నాయి.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *