స్థానిక ఎన్నికల్లో అధిక స్థానాలలో బిఆర్ఎస్ దే విజయం -స్థానిక ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వండి- పార్టీ శ్రేణులకు సూచించిన పైలెట్ రోహిత్ రెడ్డి,

రాజకీయం 

Kura yadaiah| September 30,2025,

Rohith Reddy|  స్థానిక ఎన్నికల్లో BRS అధిక స్థానాలలో విజయం సాధిస్తుందని రాబోయేది BRS ప్రభుత్వమేనని మంగళవారం రోజు తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రోహిత్ రెడ్డి అన్నారు……

Rohith Reddy|తాండూర్ :  స్థానిక ఎన్నికల్లో సమరం మాదేనని స్థానిక ఎన్నికల్లో BRS పార్టీ అధిక స్థానాలలో జడ్పిటిసి ఎంపిటిసి  కైవసం చేసుకుంటుందని తాండూర్ మాజీ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజు తాండూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో  ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో BRS పార్టీయే అధికారం  సాధిస్తుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రోహిత్ రెడ్డి అన్నారు .6 గ్యారంటీలు 420 ,హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాకీ కార్డు వివరాలను వివరించాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు.

-స్థానిక ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వండి, పార్టీ శ్రేణులకు సూచించిన పైలెట్,

స్థానిక ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీటీసీ స్థానం పరిధిలో ముఖ్య మండల నాయకులతో కమిటీలు మరియు తాండూర్ పట్టణ నాయకులు ఇన్చార్జి బాధ్యతలు తీసుకొని పార్టీ శ్రేణులు కలిసికట్టుగా అధిక స్థానాలు గెలిచే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తాండూర్ బషీరాబాద్ పెద్దేముల్ కోటపల్లి మండలాల నాయకులకు కార్యకర్తలకు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆయా మండలాల మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *