తాండూర్ లో నిర్వహించే, వివా కామ్రేడ్ మఠం రవికుమార్, అడుగుజాడల అన్వేషణ పుస్తకావిష్కరణ సభకు అశేష జనం తరలిరండి

పుస్తకావిష్కరణ సభ

Kura Yadaiah| November 17,2025

హిందు 9 న్యూస్ బ్యూరో :

Book ? | వివా కామ్రేడ్ మఠం రవికుమార్ అడుగుజాడల అన్వేషణ అనే పుస్తకావిష్కరణ సభ నవంబర్ 20 గురువారం సింధు గర్ల్స్ జూనియర్ కాలేజీ నందు ఆవిష్కరిస్తున్నట్లు సభ అధ్యక్షులు కరుణ తాయమ్మ తెలిపారు…..

తాండూర్ : వివా మఠం రవికుమార్ అడుగుజాడల అన్వేషణ అనే పుస్తకావిష్కరణను నవంబర్ 20 , 2025 గురువారం రోజు సాయంత్రం 4:00 గంటలకు వికారాబాద్ జిల్లా తాండూర్ సింధు గర్ల్స్ జూనియర్ కాలేజ్ నందు నిర్వహిస్తున్నట్లు సభాధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ తాయమ్మ కరుణ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. వివా కామ్రేడ్ మఠం రవికుమార్ పిడి కతాడిత బడుగుల కోసం విప్లవంలో పోరాడి తాను మంజీరా అడుగుజాడల అన్వేషణ అనే పుస్తకం ద్వారా తన జ్ఞాపకాలను తన అడుగుజాడలను నెమరేసుందామని తెలిపారు. మహోన్నత లక్ష్యం కోసం సమ సమాజ నిర్మాణం కోసం అమరుడైన ఈ ప్రాంత వ్యక్తి రవి కుమార్ అని తెలిపారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మేధావులు సామాజికవేత్తలు సామాజిక ఉద్యమకారులు పౌరులు ప్రజాస్వామిక వాదులు మహిళలు విద్యార్థులు పాల్గొనాలని పేర్కొన్నారు.
కార్యక్రమానికి వక్తలుగా గడ్డం లక్ష్మణ్ పౌరహక్కుల సంఘం తెలంగాణ అధ్యక్షులు, పద్మ కుమారి అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, కే భాస్కర్ అడ్వకేట్ ఎక్స్ ఎంపీపీ బషీరాబాద్, రంగారావు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రిటైర్డ్, విజయలక్ష్మి పండిట్ అడ్వకేట్, టి నింగేష్ రిపోర్టర్ సుజావుద్దీన్ గెజిటెడ్ హెడ్మాస్టర్ రిటైర్డ్, కే నాగభూషణం టిపిపి కడప జిల్లా అధ్యక్షులు హాజరవుతారని పేర్కొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *