రాజకీయం
Kura Yadaiah| November 14,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :


జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు విజయాన్ని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్యాంపు కార్యాలయంలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు……
Political|తాండూర్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. విజయాన్ని పురస్కరించుకొని తాండూర్ ఎమ్మెల్యే మన రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేతలు కార్యకర్తలు టపాకులు కాల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అందరూ మిఠాయిలు పంచుకొని తమ సంతోషాన్ని ఆనందాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పంచుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ సర్దార్ సీనియర్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
