Oplus_131072

కాలమ్స్ కాదేదీ కథకనర్హం.. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటుకు!

కాదేది కథకనర్హం,

Kura yadaiah| October 29,2025,

హిందు 9న్యూస్ డెస్క్ :



సామాజిక రాజకీయ సమగ్ర వార్తా విశేషాల సమాహారం



వార్త కు కాదేదీ కథకనర్హం

 

Oplus_131072

ఇంటిని నడిపే పెద్దలే!  మమ్మల్ని కనిపెట్టుకొని ఉండాల్సిన అయ్యా అమ్మే!  కష్టసుఖాలు చూడాల్సిన వాళ్లే!   మేము నమ్మిన వాళ్లే !మా నమ్మకాన్ని నిలబెడతారు లే
వాళ్ళే!

ఎవరో కాదు వాళ్ళే! అర్ధరాత్రి కాదు పట్టపగలు కాదు అది అపరాత్రికి  కాదు!
ఇంట్లో దొంగలు పడ్డారా పడలేదు!

అదేదో గాని నమ్మిన అయ్యే… మా ఘనమైన  అయ్య ఇంట్లో చెంబు చెంత తీసుకెళ్లి అమ్మేశాడు! గిన్నీముంతా  తీసుకెళ్లి అంగట్లో అమ్మేశాడు! పాత బకెట్ తీసుకెళ్లి సంతలో అమ్మేశాడు!

తాగుబోతోడని తిడదామా తిట్టలేం!

అయ్య కదా.. అధికారం ఉంది కదా… ఆడెంతంటే అంతే కదా… ఇరుక్కుమనడానికి లేదు కదా… అలాగని గురుకుమానకుండా  ఉండలేము కదా?!

అప్పుడు కూడా యెంటిది ?అని అడగకుండా ఉండడం కుదరదు కదా! లేదు లేదు నీకోసమే అన్నాడు! మీ క్షేమం కోసమే అన్నాడు ! మీ అభివృద్ధి కోసమే అన్నాడు! మీ సంక్షేమమే మా లక్ష్యం అన్నాడు!
అంతటితో ఆగలేదు మేకలు కోళ్లు తీసుకెళ్లి సంతలో టోకున అమ్మేశాడు! బర్రెలు మేత పెట్టలేము గాని దాన వాటికి దండగని అమ్మేశాడు!
ఉన్న గొడ్డు గోదా తీసుకెళ్లి పశువుల సంతలో అమ్మేశాడు!
కాలిన కడుపులతో ఉన్న పేదలను చూడకుండా!బియ్యం కూడా అమ్మేశాడు!
ఆరు కాలం కష్టపడి నిండు నెలలు ఉన్న ఇంట్లో దాచిన ధాన్యం అమ్మేశాడు !పప్పులు అమ్మేశాడు! ఉప్పులు అమ్మేశాడు! ఉప్పు దాచుకున్న దాకా అమ్మేశాడు!

అంతటితో ఆగలేదు… మా పెద్దోళ్ళు జీవనాధారంగా సంపాదించిన పండే పొలం అమ్మేశాడు!
పొలం పక్కనున్న పుట్ట అమ్మేశాడు!
పుట్ట పక్కనున్న చిన్నచిన్న పొదలతో కలగలిసి ఉన్న గుట్ట అమ్మేశాడు!
ఆ గుట్ట చుట్టూ ఉన్న గట్టును కూడా అమ్మేశాడు!
అన్ని అమ్మి ఏ పాటి సంపాదించావు !అని అడిగితే అన్ని ఎక్కడ అమ్మినం ఇంకా అమ్మాల్సినవి చాలా ఉన్నాయని మాతయ్యకు మాతవ్వ వత్తాసు పలికింది!

మాతవ్వ అంత తీసుకెళ్లి మాతయ్య చేత్తులో పెడితే
మేమెంత కష్టపడి అమ్ముతున్నాము మీకు తెలియదు  ఇద్దరూ కూడా పలుకుకొని ఒకేసారి అన్నారు!బుజ్జి నాన్న చిన్న కన్నా గబగబా రెండు ముద్దులు ఇచ్చి ముక్కులోని బంగారపు పోగు లాగి గబుక్కునమ్మేశాడు!
దగ్గరకు చేరదీసి రెండు చెవులకు ఉన్న బంగారపు పోగులు తీసుకెళ్లి జువెల్లర్లో అమ్మేశాడు!
మొగ పిల్లగాని మొల మీద మొలతాడు లాగేశాడు!
ఎవరైనా కొనపోతారా అన్నాడు!
కూర్చున్న చెక్క కుర్చీని అమ్మేశాడు!
పండుకున్న పాత పరుపు తీసి గోనెసంచుల అమ్మేశాడు!
చివరకు చాప మీద పండుకుంటే అది తీసుకెళ్లి రోడ్డు మీద అమ్మేశాడు!
కట్టుకున్న కొక్కలమ్మేశాడు! రైకలు అమ్మేశాడు! పంచేలు అమ్మేశాడు!
గట్టిగా గోసి లాగి ఉన్న పంచా అమ్మేశాడు!
అవి వేసే మగ్గంఅమ్మేశాడు!
మగ్గం లో పేనుతున్న దారం అమ్మేశాడు!
పొయ్యి మీద ఉడుకుతున్నవి అమ్మేశాడు !పోయ్యి కిందివి అమ్మేశాడు! కాలిపోయిన బూడిదను కూడా ఎంతో కొంతకు అమ్మేశాడు!
కంటికి కనబడితే చాలు మటుమాయం చేశాడు!
ఇదంతా మీకోసమే అంటాడు!
ఓ పద్ధతి ప్రకారం అమ్మి నగదును జమ చేస్తానన్నాడు!
అందుకు ఐదు ఏండ్లు పడుతది అన్నాడు!
కోట్లు కూడేసి ఏమిటి చేస్తావని అడిగినాం!
లక్షల కోట్లు కూడేస్తానన్నాడు!
ఇంట్లో గదులు ఖాళీ చేస్తే ఎవర్నో పిలిచి మీరు లీజుకు తీసుకోండని నవ్వుతూ అన్నాడు! ఖాళీగా ఉన్న జాగను
అమ్ముతం కొనుక్కోండి అన్నాడు !వాళ్లు కొన్న మనకి ఆ ఆస్తుల మీద హక్కులుంటాయని నమ్మబలిచిండు!
ఇల్లమ్మేశాడు! ఇంటి ముందు రోడ్డు కూడా అమ్మేశాడు! నా చెట్ల అమ్మేశాడు!
నీళ్లు చేదుకునే పాత బావి కూడా అమ్మేశాడు!
నీటిలో మేము పెంచుకున్న చిన్న చేప పిల్లలను అమ్మేశాడు!
తరతరాలుగా తాత తండ్రుల నుండి కాపాడుకొచ్చిన భారత వారసత్వ సంపద అలాగ అమ్మేస్తే ఎలాగా! అని మెల్లమెల్లగా అడిగాం!
ఉమ్మడి  ఆస్తి ఎవరి చేతికో అందించి చేతులు దులుపుకుంటే ఎలాగా!
దాన్ని కాపాడే బాధ్యత ఇంటి పెద్దగా మీదే కదా అని అడిగితే!
నా ఈక మీరు పీకలేరు అన్నట్టు మమ్మల్ని అరగ చూశాడు!
బొక్కలేసి తొక్కేస్తానన్నట్టు గుడ్లు ఉరిమి చూశాడు!
మీ కుటుంబాలను నడిపే బాధ్యత బరువు నాది అన్నాడు!
ఆ బాధ్యత కోసమే నేను అమ్ముతున్నానని నమ్మబలికిండు!
మాతయ్య చేసిన పని మరో తాగుబోతోడు చేసినడని తాట తీసి తానాలో పడేసిన్రు!
మాతయ్య చేసిన పని మరో దొంగ చేశాడని కుమ్మేసి జైల్లో పడేసి కేసులు పెట్టినారు!
మాతయ్య చేసినంత కాదు కదా కనీసం అవసరానికి ఇంట్లో పూచిక పుల్ల అమ్మిన సంసారివేనా అనేసి తిట్టిపోసేవారు!
అందుకే మాతయ్యను చూస్తే మా కుటుంబానికి చాలా గర్వంగా ఉంటుంది!
ఆదాయం లేనప్పుడు ఆస్తులు అమ్మి డబ్బు చేసుకోవడమే ఆర్థిక అభివృద్ధి! దేశ అభివృద్ధి! కుటుంబభివృద్ధి!
అమ్మితే వచ్చినంత డబ్బు కష్టపడితే రాదు గాక రాదు కదా!
అందుకే మీ మౌలిక అవసరాలు సదుపాయాల కోసమే నా ఉపాయం అన్నాడు గర్వంగా మాతయ్య !
అమ్ముతుంటే చూస్తున్నది! ఏం చేస్తుందో అధికారం!

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *