భద్రత
Kura Yadaiah| November 17,2025
హిందు 9 న్యూస్ బ్యూరో :-


SP Vikarabad| సోమవారం నుండి డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా లాంచ్ అనంగా ప్రారంభించారు. సోమవారం నిర్వహించిన డైల్ యువర్ ఎస్పి కార్యక్రమానికి వివిధ సమస్యలకు సంబంధించి 26 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు……
SP Vikarabad|వికారాబాద్ : ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు నేరుగా డైల్ యువర్ ఎస్పి కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం లాంచనంగా ప్రారంభించారు.
జిల్లా ఎస్పీతో నేరుగా సమస్యలు వివరించండి,
మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలు మాడిఫైడ్ సైలెన్సర్లతో కూడిన వాహనాల ద్వారా ఇబ్బందులు తలెత్తే, అక్రమ ఇసుక రవాణా అక్రమ ఎర్రమట్టి తవ్వకాల రవాణాకు సంబంధించిన ఫిర్యాదులతో పాటు భార్యాభర్తల గొడవలు వ్యక్తిగత సమస్యలు పొలాలలోకి అక్రమంగా ప్రవేశించడం ట్రాఫిక్ సమస్యలు తదితర సమస్యలపై నేరుగా డయల్ యువర్ ఎస్పీ ద్వారా సమస్యలను తమ తీసుకురావచ్చని ఎస్పీ కే, నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం రోజు నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో మాడిఫైడ్ సైలెన్సర్లతో కూడిన వాహనాల ఇబ్బందులు అక్రమ ఇసుక రవాణా అక్రమ ఎర్రమట్టి రవాణా భార్యాభర్తల మధ్య గొడవలు ట్రాఫిక్ సమస్యలపై ఫిర్యాదులు నమోదు అయినట్లు తెలిపారు. ప్రజలు ఇకనుండి తమ పిర్యాదులను నమోదు చేయడానికి సుదూర ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి రావలసిన అవసరం లేదని ఫోన్ ద్వారానే నేరుగా ఫిర్యాదు చేయొచ్చని ఆ ఉద్దేశంతోనే యువర్ ఎస్పి కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎస్పీ పేర్కొన్నారు. మొదటి రోజు నిర్వహించిన డైల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నుండి మొత్తం 26 కాల్స్ వచ్చినట్లు ఆయన తెలిపారు.
ప్రతి సోమవారం డయల్ యువర్ ఎస్పీ వికారాబాద్,
అయితే ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు జిల్లా ఎస్పీ స్వయంగా డయల్ యువర్ ఎస్పి కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొన్నారు. డయల్ యువర్ నెంబర్:-08416,255601 నెంబర్ కు కాల్ చేసి జిల్లా ప్రజలు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమస్యలను నేరుగా పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రజా భద్రత పట్ల సమస్యల పట్ల తక్షణ చర్యలపై పోలీస్ శాఖ మెరుగైన సేవలందించుటకై సిద్ధంగా ఉందని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి రాములు నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
