డాక్టర్ వెంకటేశ్వర్లు,
kura yadaiah| October 17,2025,
జిల్లా వార్తలు : హిందు 9న్యూస్
Bc| బీసీ రిజర్వేషన్ల అమలుకై రేపు రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ బందును వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీలు పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ కన్నోజు వెంకటేశ్వర్లు కోరారు…..
Bc| 42 శాతం రిజర్వేషన్ అమలుపరచాలని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని రేపు రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా వికారాబాద్ జిల్లాలో బీసీలందరూ బంద్కు సహకరించి పాల్గొనాలని ఉద్యమ నేత జిల్లా బీసీ సేన అధ్యక్షులు డాక్టర్ కన్నోజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చితేనే దానికి ఒక రూపం వస్తుందని అది చట్టబద్ధత అవుతుందని దానికోసమే బీసీలు పోరాటం చేయాలని కోరారు. మొట్టమొదటగా రేపు పోరాట రూపాన్ని అందుకున్న బీసీ బంద్ ను బీసీ ప్రజలందరూ దిగ్విజయం చేయాలని కోరారు.
