Pdsu srinivas
kura yadaiah| October 17,2025,
హిందు 9న్యూస్ డెస్క్ :
pdsu|బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపరచాలని 18 తారీఖున జరగబోయే బీసీ బంద్ కు తమ సంపూర్ణ మద్దతు తెలియజేసింది పిడిఎస్యు జిల్లా కమిటీ….
pdsu|బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రేపు జరగబోయే బీసీ బందుకు pdsu ప్రగతిశీల విద్యార్థి సంఘం తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పట్నం శ్రీనివాస్ తెలిపారు. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని వాటిని చట్టబద్ధత చేస్తూ రాజ్యాంగం లోని 9 షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించే విధంగా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల పక్షపాత వైఖరి చూయించకుండా సామాజిక న్యాయం పాటించాలి శ్రీనివాస్ కోరారు. ఈ నేపథ్యంలోనే రేపు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా జరగబోతున్న బందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు శ్రీనివాస్.
