రేపే తాండూరులో బీసీ బంద్-తండోపతండాలుగా తరలి రండి, JAC నేతలు కందుకూరి రాజ్, ఈటికి శ్రీనివాస్ గౌడ్ పిలుపు,

kura yadaiah |October 17,2025,

హిందు 9న్యూస్ ప్రతినిధి :

Bc|బీసీ బంద్ కు వేలాదిగా తాండూర్ కు తరలిరావాలని బీసీ ప్రజలతో పాటు ఇతర కుల సంఘాలను ప్రజాస్వామిక వాదులను ప్రజాసంఘాలను జేఏసీ నేత కందుకూరి రాజ్కుమార్ ఈడికి శ్రీనివాస్ గౌడ్ కోరారు....

Bc|రేపు తాండూరులో బీసీ రిజర్వేషన్ల అమలుకై జరగబోయే బంద్ కు తాండూర్ నియోజకవర్గంలోని బీసీ ప్రజలతో పాటు బీసీ నాయకులు ఇతర రాజకీయ పార్టీలు ప్రజాస్వామికవాదులు కుల సంఘాలు ప్రజా సంఘాలు సామాజిక న్యాయానికి మద్దతు పలికే ప్రతి ఒక్కరు బందులో పాల్గొని బీసీ సమాజానికి అండగా నిలబడాలని తాండూరు జేఏసీ నేత కందుకూరి రాజ్ కుమార్ ఈడికి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వం ఐక్య సంఘటనతో ముందుకొచ్చి స్థానిక సంస్థల్లో 42% బిసి బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించి బీసీలకు సామాజిక న్యాయం చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలను 42 శాతం రిజర్వేషన్తో జరిపే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని వారు పిలుపునిచ్చారు. సహకరించేందుకు రేపు జరగబోయే బంద్ లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని వారు కోరారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *