భద్రత,
హిందు 9 న్యూస్ 22/4/2026,

వేసవి సెలవుల్లో తమ పిల్లలతో కలిసి స్వగ్రామాలకు గాని వివాహారయాత్రాలకు వెళ్లేటప్పుడు తమ ఇండ్లకు తాళాలు వేసి విలువైన వస్తువులను బ్యాంకులలో దాచుకొని ఇంటి పక్క వారికి వచ్చేవరకు చూడమని అభ్యర్థించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా వెల్లడించారు…..
వికారాబాద్ జిల్లా :వేసవి సెలవులు రావడంతో పిల్లలతో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు లేదా విహారయాత్రకు వెళ్తుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా ఓ పత్రిక ప్రకటనలో వెల్లడించారు.
పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో చాలామంది కుటుంబాలతో కలిసి బయటకు వెళుతున్న పరిస్థితి ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని దొంగలు చోరీల పాల్పడే అవకాశం ఉందని అందుకని ఇంటికి తాళం వేసి నగదు బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకులో భద్రపరుచుకోవాలని ప్రజలను కోరారు.
ఇంటి చుట్టుపక్కల సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని మొబైల్ ఫోన్లకు అనుసంధానం చేసుకోవడం మంచిదని ఎప్పటికప్పుడు వాటి ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
పొరుగు వారికి బంధువులకు తమ ప్రయాణ వివరాలు తెలియజేయడం ఇంటి వద్ద అప్పుడప్పుడు చూడమని వారిని అభ్యర్థించుకుంటే మంచి ఉంటుందని పేర్కొన్నారు.

రాత్రి సమయంలో ఇంటి బయట లైట్లు వెలిగేలా ఆటోమేటిక్ టైమర్లు అమర్చుకోవడం పోస్టులు లేదా పార్సెల్ పేరు పోకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా ఇంట్లో ఎవరూ లేరని అనుమానం రాకుండా చూడవచ్చునని తెలిపారు.
_____అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే, 100 కు ఫోన్ చేయండి,
అనుమానస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినప్పుడు వెంటనే డైల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం అందివ్వాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.
వేసవికాలంలో పెరుగుతున్న ఎండల తీవ్రత పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పిల్లలు సరదా కోసం చెరువులు కుంటలు కాలువల వద్దకు ఈతకొట్టేందుకు వెళ్లకూడదని తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని గుర్తు చేశారు.
పిల్లలపై దృష్టి పెట్టకపోతే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ కుటుంబం తీరని ఆవేదనలకు బాధలకు గురికావాల్సి వస్తుందని సూచించారు.
ప్రజల భద్రత కోసం పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారని అయినప్పటికీ ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి తగిన సూచనలు పాటించి చోరీ ప్రమాదాలను నివారించుకోవాలని మరోమారు కోరారు.
