పెద్దెముల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు,

రాజకీయం

K, Yadaiah| August 20,2025

పెద్దెముల్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు…
పెద్దేముల్: బుధవారం రోజు పెద్దేముల్ మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు ప్రకటించారు.

అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను పార్టీ కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ యువత ఓటు హక్కును 25 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు కుదింపు చేసి ఆనాడు దేశ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించారని యువతకు పెద్దపీట వేసి ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్ అన్నారు.

అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత బస్సు ఉచిత విద్యుత్తు రైతు భరోసా రైతు రుణమాఫీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ తో పేదలను అనేక రకాలుగా నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని తెలిపారు. తాండూర్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తో పాటు పేదలకు ప్రభుత్వం ఈరోజు అండగా ఉందంటే అది రాజీవ్ గాంధీ ఆనాడు కలలుగన్న స్వరాజ్యమేనని రియాజ్ అన్నారు. రేషన్ కార్డులు గత ప్రభుత్వం పదేళ్ల నుండి ఇవ్వలేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డును అందివ్వడానికి కంకణం కట్టుకోవడం ప్రజల ఆహార భద్రత హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు ఇది నిదర్శనం అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రజలకు ప్రతి సంక్షేమ పథకం అందే విధంగా చూస్తామని తెలిపారు.

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోపాల్ మాజీ కోఆప్షన్ నెంబర్ ఎండి నసిర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పివి ప్రవీణ్ కుమార్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు బుద్ధారం వెంకటయ్య కార్యదర్శి వడ్ల ఆనందచారి జైపాల్ రెడ్డి కోళ్ల పెంటప్ప కోళ్ల గోపాల్ గాజుల ఇబ్రహీం కుమ్మరి విట్టల్ డివై అరవింద్ సామెల్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *