ప్రభుత్వం
K, Yadaiah| August 21,2025

గ్రామాల సరిహద్దుల గుర్తింపుకు సర్వే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మొదటగా పైలెట్ ప్రాజెక్టుగా వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ మండల కేంద్రాన్ని ఎంచుకున్నట్లు ఏడీ, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ అధికారి ఎం రామ్ రెడ్డి తెలిపారు…….
వికారాబాద్ : గ్రామాల సరిహద్దుల గుర్తింపునకు సర్వే డేటా బేస్( ABDB) లో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా వారు వికారాబాద్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించినట్లు ఏడి సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ అధికారి ఎం రామిరెడ్డి తెలిపారు. జిల్లాలో గల అన్ని గ్రామాల సరిహద్దులను సర్వే చేయుటకు నిర్ణయించడంతో ఇట్టి సర్వే కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో మొదటగా వికారాబాద్ మండలంలో నిర్వహించనున్నట్లు, ఏడి, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ అధికారి ఎం రామ్ రెడ్డి తెలిపారు. ఈ సర్వే ను మొదటగా వికారాబాద్ మండలంలో 21/08/2025 నుంచి ప్రారంభించడం జరుగుతుందని AD ,సర్వే & ల్యాండ్ రికార్డ్స్ అధికారి తెలిపారు.
