ముఖ్యాంశాలు,
Kura Yadaiah January 27,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :

మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ మహేందర్ నగర్ దివ్యాంగుల కాలనీలో 77 వ, గణతంత్ర దినోత్సవ వేడుకలు వికలాంగులు ఘనంగా నిర్వహించుకున్నారు…..
మేడ్చల్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ జిహెచ్ఎంసి పరిధిలోని అన్నోజిగూడ మహేందర్ నగర్ దివ్యాంగుల కాలనీలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని వికలాంగులు ఘనంగా నిర్వహించుకున్నారు. బాడీస్ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ అసోసియేషన్ గౌరవ సలహాదారు ఉపేంద్ర ఆధ్వర్యంలో ఈ వేడుకలను జనవరి 26 సందర్భంగా సోమవారం రోజు జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమలు చేసుకుని నేటికీ 77 వసంతాలు పూర్తవుతున్న రాజ్యాంగం చట్టాలు ఇంకా చాలా మంది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంకా దేశంలో రాష్ట్రంలో రాజ్యాంగ ప్రకారం వికలాంగులకు దక్కాల్సిన అన్ని హక్కులు కూడా దక్కాలని చట్టపరమైన అంశాలలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడే వికలాంగులు అభివృద్ధిలోకి వస్తారని పేర్కొన్నారు. మరోసారి భారత 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బుల్లయ్య మైసయ్య కే బాలమని పద్మ అరుణ పూజిత వనిత బిక్షపతి మహేష్ శిరీష పూలమ్మ దాసరి విజయ రాజు రాములు గౌడ్ రమణమ్మ అంజయ్య కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
