డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి, హైదరాబాద్ ప్రజా భవన్ లో చిన్నారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన DMJU నేతలు,నేతలు,

వినతి పత్రం, 

Kura Yadaiah| October 28,2025,

హిందు 9 న్యూస్ డెస్క్ :

Digital media| రాష్ట్రంలో డిజిటల్ మీడియా జర్నలిస్టు ల సమస్యలను పరిష్కరించాలని డిజిటల్ మీడియా కు చట్టబద్ధత కల్పించి  అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని హైదరాబాద్ ప్రజా భవన్ లో ప్రజాభవన్ ఇన్చార్జి చిన్నారెడ్డి ప్రజా భవన్ అధికారి దివ్యలకు డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున వినతిపత్రం ఇచ్చారు…...

Digital media|రాష్ట్రంలో డిజిటల్ మీడియా జర్నలిస్టు లను ప్రభుత్వం తక్షణమే గుర్తించాలని డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని మంగళవారం రోజు హైదరాబాద్ ప్రజా భవన్ లో డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా భవన్ ఇన్చార్జ్ చిన్నారెడ్డి  అధికారి దివ్య లను కలిసి వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత సమకాలీన సమాజంలో డిజిటల్ మీడియా వెబ్ మీడియా యూట్యూబ్ మీడియా, ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా నిలబడుతూ ముందు వరుసలో ఉన్నాయని, జర్నలిస్టులుగా ప్రభుత్వాలను ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ ప్రభుత్వం దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లి వాటికి పరిష్కారం మార్గాలు దొరికేవరకు డిజిటల్ మీడియా జర్నలిస్టులు పోరాడుతున్నారని రాష్ట్ర కమిటీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

డిజిటల్ మీడియా జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలి,

డిజిటల్ మీడియా జర్నలిస్టులను కూడా ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు .రాబోయే కాలం ప్రపంచ దేశాలలో డిజిటల్ మీడియానే ప్రథమ స్థానంలో ఉంటుందని తెలిపారు. కాబట్టి డిజిటల్ మీడియా మీడియాకు చట్టబద్ధత కల్పించి జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి అక్రిడేషన్లను ఇచ్చి ఆదుకోవాలని చిన్నారెడ్డిని కోరారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రిలో ఉచిత వైద్య సదుపాయాల కోసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం డిజిటల్ మీడియా జర్నలిస్టుల పట్ల స్పందించాలని చిన్నారెడ్డి ప్రజా భవన్ అధికారులకు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు విన్నవించారు. ఈ సమస్యల పట్ల స్పందించిన సంబంధిత ప్రభుత్వ నేతలు సమాచార శాఖ రాష్ట్ర కమిషనర్ కు ఫోన్ లో ప్రజాభవన్ అధికారులు మాట్లాడి తగు సూచనలు చేసినట్లు యూనియన్ నేతలు తెలిపారు. కార్యక్రమంలో డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ వ్యవస్థాపకులు ఎంపీలు ముతేష్, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కె రాజేంద్రప్రసాద్ బొడ్డు అశోక్ రాష్ట్ర నాయకులు కే వెంకట చారి వేణుగోపాల్ యుగేందర్ కడమంచి చెన్నయ్య కర్ణ కుమార్ కొమ్ము గణేష్ తాడూరి సంపత్ జగదీష్ గుండుమల్ల శ్రీనివాస్ ఉదయ్ ఉదయ్ కుమార్ ఎం రమేష్ జి రాజేష్ ఎన్ సులక్షణ బి వెంకటేశ్వర్లు చాంద్ పాషా కిరణ్ లింగన్న ప్రశాంత్ రెడ్డి అనంతయ్య అశోక్ గణేష్ పి కృష్ణయ్య జి మహేష్ టి సతీష్ డి రాజు సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *