రేగొండి లో గత వారం రోజులుగా అనుమానాస్పదంగా నిలిచి ఉన్న టిప్పర్ లారీ.!-స్థానిక పోలీసులకు సమాచారం అందించిన, సర్పంచ్ అశోక్

స్పాట్ న్యూస్,

హిందు 9 న్యూస్ 16/4/2026:

 

________అనుమానాస్పదంగా టిప్పర్ లారీ.!, పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందించిన, రేగొండి సర్పంచ్ డి,అశోక్

_____విచారణ జరిపి పూర్తిస్థాయి సమాచారం అందిస్తామన్న, పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్,

గత వారం రోజులుగా రేగొండి గ్రామపంచాయతీ చర్చి సమీప పొలాలలో అనుమానాస్పదంగా ఓ టిప్పర్ లారీ నిలిచి ఉన్నదని ఇప్పటివరకు ఆ టిప్పర్ను ఎవరు వచ్చి తీసుకెళ్లకపోగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందించినట్లు గ్రామ సర్పంచ్ అశోక్ తెలిపారు….

పెద్దేముల్ :  పెద్దేముల్ మండలం రేగొండి గ్రామపంచాయతీ లో గల చర్చి సమీపాన ఉన్న పొలాలలో ఓ పసుపు కలర్ టిప్పర్ లారీ ఆగి ఉండడం స్థానికులను కలవరానికి గురి చేసింది. ఈ టిప్పర్ గత వారం రోజులుగా ఇక్కడే నిలిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు అనుమానం వచ్చి స్థానిక సర్పంచ్ డి, అశోక్ కు సమాచారం అందించారు.

దాంతో స్పందించిన సర్పంచ్ అశోక్ స్థానిక పెద్దేముల్ ఎస్సై కి ఇదే విషయమై సమాచారం అందించినట్లు తెలిపారు.

ఈ విషయమై స్థానిక ఎస్సై నీ వివరణ కోరగా అసలు టిప్పర్ ఓనరు ఎవరు? టిప్పర్ ఏ ప్రాంతానికి చెందింది.? ఇక్కడికి టిప్పర్ను తీసుకొచ్చి పెట్టింది ఎవరు? ఇలా పూర్తిస్థాయి వివరాలు తెలుసుకొని  తదుపరి సమాచారం అందిస్తామని ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *