సామాజిక న్యాయదృష్ట దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాల్సిందే, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,

సామాజిక వార్తలు,

హిందు 9 న్యూస్ తెలంగాణ బ్యూరో :16/4/2026,

__________సామాజిక న్యాయం దృష్ట్యా దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాల్సిందే, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ డిజేబులిటీ రియాబిటేషన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దివ్యాంగులకు సహాయ పరికరాలు పంపిణీ చేశారు…..

హైదరాబాద్ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ డిస్టిక్ డిజబులిటీ రియాబిటేషన్ సెంటర్ నందు దివ్యాంగులకు ఏర్పాటుచేసిన సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొని దివ్యాంగులకు సహాయ పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిధులు కేటాయించగా సి ఎస్ ఆర్ ద్వారా అలింకో సంస్థ పరికరాల తయారీ కార్యక్రమాన్ని చేపట్టిందని వారి సహకారం మేరకు ఈరోజు దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేపట్టడం జరిగిందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు .

దేశంలోనే ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రపంచంలోనే ఒక ప్రముఖమైన స్థానం ఉందని ఎంపీ పేర్కొన్నారు.

ఈ సహాయ పరికరాలు దివ్యాంగులకు అందివ్వడంలో సహాయపడిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పాటుగా సి ఎస్ ఆర్ అలిమ్ కో కు తదితర సంస్థలకు అభినందనలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు.

మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో దివ్యాంగుల కోసం దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను తీసుకురావడం జరిగిందని అవే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను సహాయ పరికరాలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని దేశవ్యాప్తంగా  కార్యక్రమాలను చేపడుతున్నదని ఆయన స్పష్టం చేశారు.

అంబేద్కర్ ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన కొని ఆడారు.

తెలంగాణ రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి చెందుతున్నదని ఆయన తెలిపారు. అంబేద్కర్ సామాజిక న్యాయంతో పాటు దేశ అభివృద్ధి కోసం కూడా పరితపించిన గొప్ప కార్యదీక్ష కలిగిన మేధావి అని  కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు.

సామాజిక న్యాయం దృష్ట్యా ఆలోచిస్తే దివ్యాంగులకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు.

దివ్యాంగులు కూడా సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో కూడా ఎదగాల్సిన అవసరం ఉందని  రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దివ్యాంగులు కూడా ఒక భాగమేనని వారిని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించి రాజకీయ రిజర్వేషన్ కోసం కృషి చేయాలని తెలిపారు.

ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సంస్థ అధికారులకు సహాయ పరికరాలు అందించడానికి సహకరించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, సి ఎస్ ఆర్ అలింకో సంస్థ ప్రతినిధులకు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి బృందం, సిిిిఎస్ఆర్ ప్రతినిధి బృందం, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, అలిన్ కో సంస్థ ప్రతినిధి బృందం, మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, ప్రస్తుత కార్పొరేటర్, ఐసిడిఎస్ బృందం జిల్లా విద్యాధికారి వికలాంగుల సీనియర్ నాయకులు చేరుకు నాగభూషణం, హిందు 9 న్యూస్ ఎడిటర్ కూర యాదయ్య అమ్మ ఫౌండేషన్ ప్రతినిధి భద్రన్న నాగేష్  వికలాంగులు వివిధ ప్రభుత్వ అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *