క్రైమ్
Kura Yadaiah| October 8,2025,


Crime|రేగోండిలో గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి, అంబ భవాని మాత దేవాలయాల్లో గుర్తు తెలియని దుండగులు దొంగతనాలకు పాల్పడినట్లు విశ్వాసనీయ సమాచారం..
హిందు 9 న్యూస్ ప్రతినిధి పెద్దేముల్:
Crime|వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొండి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి అలాగే అంబ భవాని మాత గుళ్ళల్లో గుర్తు తెలియని దుండగులు అమ్మవారి కళ్ళను ఇతర బంగారు వెండి వస్తువులను దొంగిలించినట్లు తెలిసింది.విషయం తెలుసుకున్న పూజారి హనుమంతు గ్రామ పెద్దలకు సమాచారం అందివ్వడంతో గ్రామ పెద్దలు గ్రామస్తులు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని పూజారి హనుమంతుకు సూచించారు. పూజారి హనుమంతు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పత్తి బోరు మోటర్ లు తదితర వాటిని గుర్తు తెలియని దుండగులు దొంగిలించినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
