గిర్మాపూర్ లో భూభారతి సమగ్ర సర్వే, క్షేత్రస్థాయిలో పరిశీలన, రైతుల భూములకు శాశ్విత పరిష్కారం, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,

స్పాట్ న్యూస్ 

Kura Yadaiah| March 12,2026,

హిందు 9 న్యూస్ :

పెద్దేముల్: రైతుల భూ సమస్యలకు భూభారతి చట్ట ద్వారా శాశ్విత పరిష్కారం చూపిస్తామని తాండూర్ MLA Manohar Reddy అన్నారు, గురువారం రోజు పెద్దేముల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి సమగ్ర సర్వే కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తూ ఈ సందర్భంగా అన్నారు. రెవెన్యూ అధికారులతో కలిసి గిర్మాపూర్ లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి భూ యజమాని రామిరెడ్డి పొలాన్ని సందర్శించి రైతులతో పాటు సర్వేర్లతో నేరుగా మాట్లాడి సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలపై ముఖాముఖి చర్చించారు.

ప్రజలకు సర్వే ప్రక్రియ ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని  రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది,

కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా రాష్ట్రంలో గందరగోళానికి దారి తీసిందని  అలాంటి పరిస్థితి రాకుండా ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా భూభారతి చట్టాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం ముందున్నదని స్పష్టం చేశారు. భూభారతి చట్ట ప్రకారం రైతులకు శాశ్విత పరిష్కారం లభించే విధంగా అధికారులు గ్రామాలలోకి వచ్చి సమగ్ర సర్వే నిర్వహిస్తారని తేల్చి చెప్పారు. పట్టా సర్వే నంబర్ స్థానంలో భూదార్ నెంబర్ను ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పారు.

భూ సర్వేలో భాగంగా పట్టా భూమి గ్రామ కంఠం ప్రభుత్వ భూములను స్పష్టంగా విడదీసి గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఈ చట్ట ప్రకారం రైతులకు పారదర్శకమైన సుస్థిరమైన భూ రికార్డు వ్యవస్థ కూడా అందుబాటులోకి రావడానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సర్పంచ్ శివరాం నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య వైస్ చైర్మన్ నారాయణరెడ్డి లోకా నరసింహులు రాంరెడ్డి రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *