గుంతల రోడ్లు, ఓవర్ లోడ్లతోనే రోడ్డు ప్రమాదాలు-పి ఓ డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి వై గీత,

ఖండన 

Kura Yadaiah| November 5,2025,

హిందు 9 న్యూస్ బ్యూరో :

Road accident|గుంతల రోడ్లు అధికలోడు కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని గుంతల రోడ్లను తక్షణమే పునర్నిర్మించి అధికలోడుతో వెళుతున్న టిప్పర్లపై గాని లారీలపై గాని అధికారులు చర్యలు తీసుకోవాలని పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై గీత డిమాండ్ చేశారు….

వికారాబాద్ :వికారాబాద్ జిల్లాలో గుంతల రోడ్లు ఉండడం  ప్రమాదాలకు ఒక కారణమైతే దానికి తోడు టిప్పర్లు లారీలు అధికలోడు తో ప్రయాణిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తూ కన్నవారికి కడుపుకోతను మిగిలేస్తున్నాయని పిఓడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి వై గీతా ఆరోపించారు. అధిక లోడుతో లారీలు టిప్పర్లు రోడ్లపై ప్రయాణిస్తే కూడా మైనింగ్ అధికారులు కానీ రోడ్ సేఫ్టీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం వల్లనే వాళ్న నిర్లక్ష్య ధోరణి వల్లనే ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఏసీబీ ఎలా అయితే  అవినీతిపరుల గుండెల్లో గుబులు పుట్టిస్తుందో మైనింగ్ శాఖ అధికారులు పోలీసులు రోడ్ సేఫ్టీ అధికారులు అధిక లోడుతో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న టిప్పర్లపై లారీలపై డ్రైవర్లపై వాటి యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటే చేవెళ్ల లాంటి  దురదృష్టకర ప్రమాదాలు  జరగకుండా ఉంటాయని చెవేళ్ళ రోడ్డు ప్రమాదంలో టిప్పర్ అధిక లోడుతో ఢీకొట్టడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని అధికార యంత్రాంగం గుర్తించడం జరిగిందని ఈ ప్రమాదంలో మరణించిన మృతులకు తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు .

ఓవర్ లోడ్ టిప్పర్లు లారీలపై అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి,

ఎంతోమంది తల్లిదండ్రులు పేదరికంలో ఉన్న కూడా పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుతూ వారికి విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిష్యత్తును తమ కళ్ళారా చూసుకోవాలని కలలుగన్న తల్లిదండ్రులకు చేవెళ్లలాంటి ఘోర ప్రమాదాలు కన్నీళ్ళను మిగిలిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రకరకాల రాష్ట్రాలు బీహార్ ఉత్తర ప్రదేశ్ హర్యానా రాజస్థాన్ ఎక్కడెక్కడినుండో ఇక్కడికి వచ్చి వారికి సరియైన డ్రైవింగ్ వస్తుందో లేదో వారికి లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోకుండా ఇక్కడ పనులలో పెట్టుకుంటున్న యాజమాన్యం కూడా ఆలోచించాలని రోడ్లపైకి వచ్చేటప్పుడు మంచి అవగాహనతో మద్యం సేవించకుండా డ్రైవింగ్ నిర్వహిస్తే యాజమాన్యానికి కూడా మంచిదవుతుందని లేదంటే ఇలాంటి దుర్ఘటనలు సంభవించి యాజమాన్యాలకు కూడా సమస్యలు చుట్టూ ముడతాయని వారు గుర్తు చేశారు.  డ్రైవర్లు వాహనాలు పోలేటప్పుడు డ్రైవర్లు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎలా ఉన్నారు యాజమాన్యాలు వారిని పరీక్షించి పంపిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే వికారాబాద్ జిల్లాలో గతంలో ఎబ్బనూర్ ఇప్పుడు చేవెళ్ల పరిగి లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రభుత్వ అధికారుల మీద ఉందని అధిక లోడుతో ప్రయాణిస్తున్న టిప్పర్లను లారీలను కట్టుదిట్టము చేసి ప్రజల ప్రాణాలకు భరోసాని ఇవ్వాల్సిన అవసరం అధికారుల మీద ఉందని ఆ దిశగా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్తే ఇలాంటి ఘటనలు జరగమని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అధిక లోడుతో వెళ్తున్న టిప్పర్లు గాని లారీలపై గాని కఠినమైన చర్యలు తీసుకునే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని కోరారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *