మహిళల ఉపాధి పై జరిగే దాడిని వ్యతిరేకిద్దాం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని హక్కుల పరిరక్షణ దినంగా పాటిద్దాం, వై గీత

ముఖ్యాంశాలు,

Kura Yadaiah /March 5,2026,

హిందు 9 న్యూస్ :

మహిళల ఉపాధి పై జరిగే దాడిని వ్యతిరేకిద్దామని మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళ హక్కుల రక్షణ దినంగా పాటిద్దామని రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి వై గీత అన్నారు……

హిందు 9 న్యూస్( వికారాబాద్ 5):మహిళల ఉపాధి హక్కులపై జరుగుతున్న దాడిని మహిళా దినోత్సవం సందర్భంగా వ్యతిరేకించాలని పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై గీత అన్నారు. గురువారం రోజు వికారాబాద్ జిల్లా అమరవీరుల స్తూపం వద్ద ప్రగతిశీల మహిళా సంఘం మార్చి 8న నిర్వహించబోయే మహిళా దినోత్సవ వాల్పోస్టర్ను తోటి మహిళా నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

1975లో ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన మేరకు మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళల పోరాట దినాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.

దేశంలో 51 సంవత్సరాలుగా మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్న మహిళలకు ఈనాటికి ఏమాత్రం రక్షణ లేదని పురుషాధిక్య బ్రాహ్మణీయ సమాజం వైపు సతి సహగమనం వైపు మనుధర్మం మతోన్మాద సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు బిజెపి దాని అనుబంధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

దేశంలో ఏ జాతీయ నాయకులకు ఈ పార్టీకి సంబంధం లేకుండా ఉపాధి హామీ పథకాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని దానిని ఈరోజు రాంజీ పథకంగా మార్చడం వెనుక ఉద్దేశం ఏందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

అమృత్ భారత్ ఉద్యోగ భారత్ బేటీ బచావో బేటి పడావో మేకిన్ ఇండియా మేడిన్ ఇండియా అచ్చేదిన్ సౌలంటు ఆత్మ నిర్భర పేరుతో దేశాన్ని సంస్థలను వ్యవసాయ రంగాన్ని అడవులను ప్రజల సొమ్ములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడమే ఏకైక లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్నదని దుయ్యబట్టారు.

ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మార్చి 8న నిర్వహించబోయే మహిళా సమావేశాలకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి మహిళా రక్షణ కోసం కదం తొక్కాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో గాయత్రీ సునీత మమతా సునీత లక్ష్మీ సత్యమ్మ అంజమ్మ మున్ని తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *