13వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా, బిఆర్ ఎస్ అభ్యర్థి, సురేష్ నాయక్ సతిమణి,

ముఖ్యాంశాలు,

Kura Yadaiah | February 7,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో ;

-వాడు అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తాం,

-కారు గుర్తుకు ఓటు వేసి సురేష్ నాయక్ ని  గెలిపించండి,

13వ వార్డు అంటేనే అభివృద్ధికి మారుపేరుగా మారబోతుందని అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లడానికి ఒకసారి అవకాశం ఇచ్చి సురేష్ నాయక్ ను గెలిపించాలని వారి సతీమణి వెల్లడించారు…..

హిందు 9 న్యూస్( తాండూర్ 7)   13, వార్డు అంటేనే అభివృద్ధికి మారుపేరుగా మారబోతుందని అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లడానికి వార్డు ప్రజలు ఒక్కసారి బిఆర్ఎస్ అభ్యర్థి సురేష్ నాయక్ కు గుర్తు కారు గుర్తుకు ఓటు వేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని వారి సతీమణి వెల్లడించారు. తన భర్త సురేష్ నాయక్ మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ కౌన్సిల్ అభ్యర్థిగా పాత తాండూర్ లోని 13వ వార్డు నుండి  బరిలో ఉన్నారని సురేష్ నాయక్ సతీమణి పేర్కొన్నారు.  ఈ సందర్భంగా శనివారం రోజు వారి సతీమణి 13వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తన భర్తను మున్సిపల్ ఎన్నికలలో గెలిపించిన అనంతరం వార్డును అన్ని విధాల అభివృద్ధి చేయడం జరుగుతుందని ఓటర్లకు వివరించారు. కావున మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలలో వార్డు ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తన భర్త అయిన సురేష్ నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలతో కోరారు.కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *