ముఖ్యాంశాలు,
Kura Yadaiah/ March 5,2026,
హిందు 9 న్యూస్ :

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక పై పెద్దెముల్ మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎంపీడీవో రతన్ సింగ్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామపచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు……
హిందు 9 న్యూస్ (పెద్దేముల్5) : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై కార్యక్రమాన్ని గ్రామసభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దాంట్లో భాగంగానే వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండల పరిషత్ కార్యాలయం లో గురువారం రోజు ఎంపీడీవో రతన్ సింగ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శిల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటినుండి జరగబోయే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో రతన్ సింగ్ తెలిపారు.

గ్రామాలలో ప్రజలకు గ్రామ సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు వాటి లబ్ధి తదితర అంశాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇండ్లు, 500 కి గ్యాస్ సిలిండర్, 200,యూనిట్స్ ఉచిత కరెంట్ ,మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ,అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ , వాటితో పాటుగా విద్య వైద్యం క్రీడాలు తదితర పథకాలపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని ప్రభుత్వం ప్రజలకు ఇస్న్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా పథకాల యొక్క స్థితిగతులు తదితర అంశాలను ప్రజలకు చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శిలు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
