ముఖ్యాంశాలు
Kura Yadaiah |February, 1,2026
హిందు 9 న్యూస్ బ్యూరో :


-ప్రవీణ్ పటేల్ మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం ,
-యువకులు ఎలాంటి ఒత్తిడిలకు లోను కావద్దు బతికుండి సాధిద్దాం,
-ప్రవీణ్ పటేల్ మా కుటుంబంలో ఒక సభ్యుడు పార్టీతో పాటు నేను కూడా ఆ కుటుంబానికి తోడుంటా -పైలెట్ రోహిత్ రెడ్డి,
ప్రవీణ్ పటేల్ మరణం తీరనిలోటని టిఆర్ఎస్ పార్టీ ఒక మంచి ధైర్యవంతుడిని కోల్పోవాల్సి వచ్చిందని ప్రవీణ్ పటేల్ మా కుటుంబంలో ఒక సభ్యుడు ఆయన కుటుంబానికి పార్టీతో పాటు నేను కూడా తప్పకుండా అండగా ఉంటానని ఆదివారం రోజు తన క్యాంపు కార్యాలయంలో ప్రవీణ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు…
హిందు 9 న్యూస్ (తాండూర్ ) :బిఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ పటేల్ మరణం తీరని లోటని పార్టీ ఒక మంచి ధైర్యవంతుడిని కోల్పోయిందని మాజీ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజు తాండూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ప్రవీణ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి బిఆర్ఎస్ నాయకులు వీరశైవ యువదళ్ నాయకులతో కలిసి నివాళులు అర్పించి సంతాపాన్ని ప్రకటిస్తూ ఈ సందర్భంగా అన్నారు. యువకులు ఎలాంటి ఒత్తిడికి లోను కావద్దని క్షణికావేశానికి లోనై ఎలాంటి అగైత్యాలకు పాల్పడుద్దని ఏదైనా ఉంటే బ్రతికి సాధించాలని రోహిత్ రెడ్డి ఆకాంక్షించారు. తాండూర్ పట్టణంతో పాటు పెద్దేముల్ మండలంలో కూడా బిఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరిగిందని అన్నారు. ప్రవీణ్ పటేల్ అత్యంత ధైర్యవంతుడు ఏ సమస్యనైనా పరిష్కరించుకొని వ్యక్తిత్వమున్న వ్యక్తి ఇలా ఆత్మహత్యకు దిగడం చాలా బాధ అనిపించిందని అన్నారు. ప్రవీణ్ పటేల్ ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటే మానసిక ఒత్తిడిలో చాలా రోజుల నుండి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని ఆయన తెలిపారు.

ప్రవీణ్ పటేల్ మా కుటుంబంలో ఒక సభ్యుడుగా ఉంటూ వచ్చారని ప్రవీణ్ పటేల్ కుటుంబానికి ఇటు పార్టీ అటు నేను తప్పకుండా అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులతోపాటు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు యువకులు తదితరులు ఉన్నారు.
