కొండాపూర్ అంగన్వాడి కి కొత్త టీచర్ వచ్చేది ఎప్పుడో ?

విద్యా, అభివృద్ధి,

Kura Yadaiah| February 28,2026,

హిందు 9 న్యూస్ :

కొండాపూర్ అంగన్వాడి సెంటర్ కు కొత్త టీచర్ నియామక ప్రక్రియ చేపట్టేది ఎప్పుడో?
-అధికారులు స్పందించి కొత్త అంగన్వాడీ టీచర్ నియామక ప్రక్రియను చేపట్టాలి,
-మా పిల్లల భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోండి, ఆవేదన వెళ్లి బుచ్చిన స్థానికులు,

కొండాపూర్ అంగనవాడి సెంటర్కు కొత్త టీచర్ నియామకాన్ని చేపట్టేది ఎప్పుడో ప్రభుత్వం స్పష్టం చేయాలని టీచర్ లేకపోవడం వల్ల పిల్లలకు విద్య బుద్ధులతో పాటు ఐసిడిఎస్ నిర్దేశించిన పలు అంశాలు పిల్లలకు చేరడం లేదని తక్షణమే ప్రభుత్వం కొత్త టీచర్ నియామక ప్రక్రియను చేపట్టాలని పిల్లల తల్లిదండ్రులు స్థానికులు డిమాండ్ చేశారు…

హిందు 9 న్యూస్ (పెద్దేముల్ 28,) : వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం కొండాపూర్ అంగన్వాడి కి కొత్త టీచర్ ఎప్పుడొస్తుందో ఇక్కడి పిల్లలకు కష్టాలు తీరేది ఎప్పుడో అర్థం కావడం లేదని రోజురోజుకు దినాలు గడుస్తున్న ప్రభుత్వం కొత్త టీచర్ నియామకాన్ని చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులు స్థానికులు ఆవేదన వెళ్లి బుచ్చారు.

గతంలో పూర్తిస్థాయి అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహించిన టీచర్ కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణాల వల్ల మరణించడం వల్ల ఇక్కడ అంగన్వాడి టీచర్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉందని ఆ స్థానంలో ఇప్పటివరకు కొత్త టీచర్ నియామకంపై ప్రభుత్వం గానీ అధికారులు కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని స్థానికులు వాపోయారు.

దాదాపుగా కొండాపూర్ అంగన్వాడి సెంటర్ లో 20 మంది అంగన్వాడీ పిల్లలు ఉన్నట్లు స్థానికంగా ఉన్న సమాచారం అయితే ఇక్కడ పూర్తిస్థాయి టీచర్ లేకపోవడం వల్ల పిల్లలకు అంగన్వాడి నిర్దేశించిన విద్యా బోధన గాని ఆటపాటలు వారిక అంతంత మాత్రంగానే అందుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.

 


ప్రస్తుతం ఈ సెంటర్ ను పక్క ఊరు టీచర్ ఇన్చార్జి గా చూస్తున్నారని, ఆయామ్మ లతో పిల్లలకు రోజువారీగా అందించే పౌష్టికాహారం అందిస్తూ వస్తున్నారని, పౌష్టికాహార ఒకటే కాకుండా పిల్లలకు ఆ బాల్య వయసులో ఐసిడిఎస్ మెనూ ప్రకారం వారి పద్ధతి ప్రకారం అన్ని రకాలుగా పిల్లలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని టీచర్ లేకపోవడం ఇబ్బందిగా ఉందని చెప్పారు.

ఉన్న టీచర్ అకాల మరణం చెంది చాలా కాలమైయ్యింది, టీచర్ లేకపోవడం వల్ల పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది,

దాదాపుగా పూర్తిస్థాయి టీచర్ అకాల మరణం చెంది చాలాకాలం కావస్తున్న ఇప్పటివరకు జిల్లా అధికారులు గానీ స్థానిక అధికారులు నియామక ప్రక్రియను చేపట్టకపోవడం ఎంత నిర్లక్ష్యమో స్పష్టంగా అర్థమవుతుందని ఇక్కడి జనం మండిపడుతున్నారు.

ఏది ఏదైనా పిల్లలకు బాల్య దశ చాలా ప్రముఖమైందని బాల్యదశలో పిల్లలకు అందాల్సిన ప్రతి దాన్ని అందించాల్సిన అవసరం ఉందని అది అంగన్వాడి సెంటర్ లోనే సాధ్యపడుతుందని పిల్లల ఎదుగుదలకు బాటలు వేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

విద్యార్థుల, చిన్న పిల్లల విద్య అభివృద్ధి పట్ల అధికారుల ప్రభుత్వాల  నిర్లక్ష్య వైఖరి తగదని ఎందుకంటే ఇక్కడ నాటిన మొక్కలే పెరిగి పెద్దవై సమాజం మార్పుకు నాంది పలుకుతాయని అన్నారు. సెంటర్ లో టీచర్ లేకపోవడం వల్ల పిల్లలు రోజువారీగా పౌష్టిక ఆహారం తిని తిరిగి వాళ్ల వాళ్ల ఇండ్లకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురిస్తున్నదని ఆవేదన చెందారు.

-తక్షణమే స్పందించి అంగన్వాడి టీచర్ ప్రక్రియను చేపట్టాలి,

ఇప్పటికైనా స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులైన తక్షణమే కొండాపూర్ అంగన్వాడి సెంటర్ కు పూర్తిస్థాయి అంగన్వాడి టీచర్ను నియమించే విధంగా చర్యలు చేపట్టి బాలల హక్కులకు రక్షణ కల్పించాల్సిందిగా స్థానికులు కోరారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *