ముఖ్యాంశాలు
Kura Yadaiah February 2,2026,
హిందు 9 న్యూస్,

-ప్రచారాన్ని మరింత ప్రభావంతంగా నిర్వహించేందుకు పార్టీ కార్యాలయాల ప్రారంభం,
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలి,
-ప్రచారంలో మహిళా శక్తి కీలకపాత్ర పోషించాలి-ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,
MLA Manohar Reddy|మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ప్రభావంతంగా నిర్వహించేందుకు తాండూరు మునిసిపాలిటీ 32వ వార్డ్ లో పార్టీ కార్యాలయాలను సోమవారం రోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు…..
హిందు 9 న్యూస్ (తాండూర్ ):మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ప్రభావంతంగా నిర్వహించేందుకు తాండూర్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా కార్యాలయాలను ప్రారంభిస్తూ ప్రచారంలో మరింత జోష్ ను పెంచేలా తాండూర్ ఎమ్మెల్యే మనో రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంలోనే సోమవారం రోజు 32 వ వార్డులో ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి, శిల్ప రాజేందర్ తో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వ విధానాలను సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ విధానాలను కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విజన్లను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో సమిష్టిగా కార్యకర్తలు కలిసి పని చేయాలని నాయకులు కార్యకర్తలను ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. పట్టణ అభివృద్ధి పై ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ప్రజలకు స్పష్టంగా తెలియజెప్పాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు.
-సంక్షేమ పథకాలు సమస్యల పరిష్కారం ఎజెండగా ముందుకెళ్లాలి,
సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం ఏకైక ఎజెండాగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు.
ముఖ్యంగా మహిళ శక్తి కీలక పాత్రను పోషించాలని మహిళా సంక్షేమ పథకాల పట్ల ప్రభుత్వ విధానాల పట్ల మహిళా కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేసి తాండూరు మునిసిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఇతరులు తదితరులు పాల్గొన్నారు.
