ముఖ్యాంశాలు,
Kura Yadaiah| February, 3,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :

అడ్వకేట్ శ్రీనివాస్ రాణించాలని పేద బడుగు బలహీన వర్గాలకు అన్నగారిన వర్గాలకు అండగా నిలబడాలని ఆకాంక్షిస్తున్నట్టు తాండూర్ సీనియర్ న్యాయవాది కే గోపాల్ అన్నారు…
హిందు 9 న్యూస్( తాండూర్ ) :ఈమధ్య న్యాయవాద విద్య కోర్సును పూర్తిచేసి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయబోతున్న శ్రీనివాస్ కు స్వాగతం పలుకుతుని మంచి న్యాయవాదిగా బడుగులకు సామాజిక వర్గాలకు అణగారిన వర్గాలకు అండగా నిలబడి న్యాయవాద వృత్తికి మంచి పేరు ప్రఖ్యాతల తీసుకు రావాలని సీనియర్ న్యాయవాది గోపాల్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సోమవారం రోజు న్యాయవాది గోపాల్ కార్యాలయంలో శ్రీనివాస్ కు న్యాయవాద వృత్తికి సంబంధించినటువంటి పుస్తకాలను శ్రీనివాస్ కు అందించి అభినందించారు. త్వరలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలని తనకు ఎప్పుడు న్యాయవాద వృత్తి పట్ల అండగా ఉంటానని మంచి న్యాయవాదుగ పేరు తెచ్చుకోవాలని గోపాల్ సూచించారు.
