ముఖ్యాంశాలు
Kura Yadaiah| January 31,2026
హిందు 9 న్యూస్ బ్యూరో :

-ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచన మేరకు-తాండూర్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకుల నియామకం,
-ఉత్తర్వులు జారీ చేసిన స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,
Tandur MLA | తాండూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించే లక్ష్యంగా తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి నేతృత్వంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచన మేరకు ఎన్నికల పరిశీలకులను నియమించారు….
హిందు 9 న్యూస్ (తాండూర్ ):తాండూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించే లక్ష్యంగా తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులను నియమించారు. శనివారం రోజు తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచన మేరకు మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా పి నర్సింలు గురురాజ్ జోషి హలీం పరిమళ నర్సింగ్ రావు (advocate ) లను ఎన్నికల పరిశీలకులగా నియమిస్తూ MLA ఉత్తర్వులు జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పరిశీలకుల పని విధానం,
కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధానంగా పరిశీలకులు పర్యవేక్షణ చేస్తూ నాయకులను సమన్వయం పరుస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పరిశీలకులతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తాండూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
