ముఖ్యాంశాలు,
Kura Yadaiah/ March 4,2026,
హిందు 9 న్యూస్ తెలంగాణ బ్యూరో:

సంక్షేమ పథకాల్లో మొఖ గుర్తింపు తప్పనిసరి అని, “ఫేషియల్ రెకగ్నిషన్ “గుర్తింపు కోసం సాంకేతికతను తీసుకురావాలని మంగళవారం రోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో కలెక్టర్లను ఆదేశించారు…
-99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా అధికారులు చూడాలి,
-సాంకేతికతను ఉపయోగించుకోండి,
-కేసులు పెట్టి బియ్యం రికవరీ చేయండి,
-ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ జరిగితే ఆ జిల్లా కలెక్టర్లను ఎస్పీలను సస్పెండ్ చేస్తాం,
-జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి,
-ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యాన్ని సహించం,
హిందు 9 న్యూస్ )తెలంగాణ బ్యూరో4,): ప్రభుత్వ పథకం కింద హరులైన లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు వీలుగా ఫేసియల్ రెకగ్నిషన్ ముఖం గుర్తింపు, సాంకేతికను తీసుకొని రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంగళవారం రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ సందర్భంగా మాట్లాడారు. సంక్షేమ పథకాలను ఉద్దేశించి దిశా నిర్దేశం చేశారు. అర్హులైన పబ్జి జరగాలని అదే సమయంలో అనర్హులైన వ్యక్తులకు లబ్ధి అందకూడదని తెలిసి చెప్పారు. కాసర పెన్షన్ల పథకం అమలులో ఇలాగే ఫేసియల్ రెకగ్నిషన్ సాంకేతికతను ప్రభుత్వం అమల్లోకి తెచ్చి దాదాపుగా మూడు లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించామని CM revanth వెల్లడించారు.
సాంకేతికతను సరిగ్గా వింగించుకోకపోవడం వల్లే పెద్ద సంఖ్యలో అనుచిత లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కలెక్టర్లు ప్రతి నెల కనీసం పది రోజులు జిల్లాలలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిస్తే వెంటనే ఆ జిల్లా కలెక్టర్ ఎస్పీని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక పేరుతో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించ తలపెట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతము చేయాలని కలెక్టర్లను CM revanth ఆదేశించారు.
-కేసులు పెట్టి బియ్యం రికవరీ చేయండి,
ప్రభుత్వం సేకరించిన 3,900, కుట్ల విలువైన బియ్యం మిల్లర్ దగ్గరే ఉంది, వాటిని రికవరీ చేసేందుకు అవసరమైతే కేసులు పెట్టి రికవరీ చేయాలని సూచించారు. కొన్ని జిల్లాలలో ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉంది ఎక్కడ ఇసుక మాఫియా ఉన్న అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిసిన జిల్లా కలెక్టర్ ఎస్పీలను సస్పెండ్ చేస్తాం అంటూ చెప్పారు. అవకతోకలకు తాగు లేకుండా రేషన్ కార్డు దారులందరికి సన్న బియ్యం సక్రమంగా పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
99 రోజుల కార్యచరణ ప్రణాళికను అత్యంత బాధ్యతతో వాటి ఫలితాలపై దృష్టి సారించి అమలు చేయాలని ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పని తీరుకు కొలమానం మీ సర్వీస్ కెరియర్ కు ఇవి పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ఖచ్చితంగా కలెక్టర్ల పైనే ఉంటుందని క్షేత్రస్థాయి పర్యటనకు జిల్లా కలెక్టర్లు వెళ్లాలని వెళ్ళని కలెక్టర్లపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

–సమర్థవంతంగా పని చేస్తేనే కొనసాగింపు,
కలెక్టర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు సిఎస్ నివేదిక ఇవ్వాలని నెలలో ఐదు రోజుల కంటే తక్కువగా పర్యటించిన కొందరు కలెక్టర్ల పనితీరుపై ఈ సందర్భంగా సీఎం తన అసహనాన్ని వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారని సూచించారు. సర్పంచులు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల సమన్వయంతో వారి భాగస్వామ్యంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలని కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి నోడల్ ఆఫీసర్గా ఇకనుండి వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
-ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం,
ఈసారి ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవాలని ఆదేశించారు ముందుగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలను వేడుకల్లా జరగాలని 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2, గ్రామసభలు నిర్వహించి వివిధ సంక్షేమ పథకాల అమలు ద్వారా ఆ ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వివరాలను అక్కడి ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలని పేర్కొన్నారు.
-గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు,
మహాలక్ష్మి గృహ జ్యోతి, 500 కు సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం రైతు రుణమాఫీ రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలన్నీ గ్రామాల వారీగా సిద్ధం చేయాలి ఆ వివరాలను కలెక్టర్లు నివేదించాలి ప్రతి గ్రామంలో పునరుత్పాదక విద్యుత్తు పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని పాఠశాలలు విద్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు తక్షణంగా అధికారులు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
-ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ ఉండాలి,
యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించాలని జాబ్ మేళాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విదతో పాటు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకూడదు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనితో పాటు అక్కడి కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు.
రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని ప్రతి పాఠశాలలో ప్రతి రోజు ఒక అధికారి మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలని పిల్లలతో పాటు భోజనం చేసే బాధ్యతలు వారికి అప్పగించాలి జిల్లా కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలని సీఎం రేవంత్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే విద్యా సంవత్సరంలో 💯 నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన మండలాల్లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభిస్తామని ఆయా స్కూళ్లలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు స్కూల్ బస్సు సౌకర్యం పాలు అల్పాహారం మధ్యాహ్న భోజనం అందిస్తామని ఏ నియోజకవర్గంలో ఏ స్కూల్ ఎంపిక చేయాలనే దానితో పాటు అక్కడున్న మౌలిక వసతులపై కలెక్టర్లు నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం తొలిరోజు జూన్ 12 నే రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫాంలో అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

-ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం సహించం,
ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా అధికారులు సందర్శించాలని సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని సీఎంఆర్ ఎఫ్ ఆరోగ్య శ్రీ కి ప్రభుత్వం ఏటా 2,500, కోట్లు ఖర్చు పెడుతున్నదని అంత ఖర్చుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అద్భుతమైన సేవలను అందించే వీలుంటుంది, కాబట్టి 35 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆసుపత్రులతో అనుసంధానం చేస్తామని చెప్పారు. సర్జరీలు చేసే డాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇస్తామని ఆసుపత్రులలో పరిపాలన వైద్య సేవలను విభజిస్తామని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.
-25 వేల బొక్కస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు,
బోకర్స్ ఉద్యోగులను సృష్టించే ఔట్సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రంలో దాదాపు 1,70, లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు 25 వేల మంది కనీసం ఆధార్ కార్డు లేకుండా ఇంతకాలం జీతాలు తీసుకున్నట్లు గుర్తించామని తెలిపారు. పదేళ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేసి వీరి పేరిట జీతాలు పొందిన ఏజెన్సీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని వాటిపై ఆర్థిక శాఖ కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు.
పాఠశాలలు బస్సులు ఇతర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించే విధంగా చూడాలని ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు ఇతర సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రహదారులపై గుంతలు ప్రమాదం జరిగే స్థలాల వివరాలను ప్రజల నుంచి వాట్సాప్ నంబర్ ద్వారా స్వీకరించి మరమ్మత్తులు చేపట్టే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఓ ఆర్ ఆర్ సర్వీస్ రోడ్ల వెంట చెత్త ఇతర నిర్మాణ వ్యర్ధాలు డంపు చేసేందుకు వచ్చే వాహనాలపై జరిమాణాలు విధించి కేసులు నమోదు చేసి ఓఆర్ ఏజెన్సీ ఇట్టి విషయంలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని cm పేర్కొన్నారు.
నగరాలు పట్టణాలలోని వర్కింగ్ ఉమెన్స్ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ ల వివరాలు నమోదు చేయాలని వాటిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా యజమాన్యాలు జవాబు దారితనంతో వ్యవహరించేలా అధికారులు వారికి సూచించాలని స్పష్టం చేశారు. పాఠశాలలు కళాశాలల్లో గంజాయి డ్రగ్స్ ఈ సిగరెట్ల వినియోగం జరిగితే అందుకు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలని ప్రతి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల కళాశాలలో సైకాలజిస్ట్ ఉండేలా యాజమాన్యాలు బాధ్యత తీసుకునేలా చూడాలని cm స్పష్టం చేశారు.
భూసార పరీక్షలు పంట మార్పిడి పంటల వైవిధ్యత ప్రయోజనాలను కచ్చితంగా రైతులకు వివరించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు.
-పనితీరు ఆధారంగా అవార్డులు,
రీజినల్ రింగ్ రోడ్డు ఫ్యూచర్ సిటీ మామునూరు ఆదిలాబాద్ ఎయిర్పోర్టులతో పాటు ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు సూటిగా నూరు శాతం భాగస్వాములు కావాలని ఈ ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుందని మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని అభినందిస్తుందని వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్లకు అవార్డులు రివార్డులు ఉంటాయని స్పష్టం చేశారు. జూన్లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎం చెప్పుకొచ్చారు.
