ఎడిటోరియల్,
Kura Yadaiah |February, 1,2026,
హిందు 9 న్యూస్ :

ఎడిటోరియల్ ,
మున్సిపల్ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్షేనా?
తెలంగాణ రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఫిబ్రవరి 11న పోలింగ్ 13న ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి ఉంటుందని తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ రాష్ట్ర సమితి బిజెపి ప్రధానమైన ఈ మూడు పార్టీలు ఎన్నికల్లో నామినేషన్లు వేసి ప్రచారానికి వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచించి ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.
అయితే గతంలో కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేసి విజయ డంకా మోగించి మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ ప్రత్యర్థి పార్టీలను ఓటమి పాలు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేయడమే కాక తెలంగాణలో మూడు ట్రిలియన్ల ఎకనామిక్ గా అభివృద్ధి చేసే లక్ష్యంతో రూపొందించే విజన్ 47 ప్రణాళికతో మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లడానికి కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాలను రచించి ఎన్నికలకు వెళ్లాలని సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో డిసిసి అధ్యక్షులను నియమిస్తూ పార్లమెంటు ఎన్నికలను ఇన్చార్జిలను కూడా ఆ పార్టీ నియమించి క్షేత్రస్థాయిలో సమన్వయంతో ముందుకెళ్లేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సన్నదమవుతుంది.
అయితే 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన అంశంలో ప్రభుత్వం అసెంబ్లీ బిల్లు రూపొందించి కేంద్ర పార్లమెంటుకు పంపించిన సంగతి విధితమే అయిన ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎంత మేరా బీసీలకు ప్రాధాన్యతను ఇస్తుందో అనేది వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తున్నది. చరిత్రలో ఏ పార్టీ చూసినా గెలుపు గుర్రాలని లక్ష్యంగా చేసుకొని పార్టీ అభ్యర్థులుగా నియమిస్తాయి వారికి ప్రాధాన్యతను కూడా ఇస్తాయి . కానీ ఇలాంటి వ్యూహాలు ఆలోచన ఆయా అభ్యర్థుల కు ప్రజల్లో ఉన్న ఇమేజ్ను బట్టి అభ్యర్థులుగా ఎన్నిక చేసుకుంటాయి. రిజర్వేషన్ల ఆధారంగా పార్టీ గెలుస్తుంది అనుకోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియంది ఏమీ కాదు.
రకరకాల సర్వేల పేరుతో తెలంగాణలో ఇప్పటిక కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులను సేకరించి బరిలో దించి మున్సిపల్ పోరుకు సిద్ధమవడం ముఖ్యమని గమనించక తప్పని పరిస్థితి.
ప్రధాన ప్రతిపక్షం బిఆర్ ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి రాష్ట్రంలో ప్రజా సమస్యల పై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావులు తీవ్రంగానే ప్రయత్నిస్తూ ఇప్పటికే ప్రజల్లో నిమగ్నమయ్యారు. అయితే గత సాధారణ ఎన్నికలు 2023లో దారుణంగా ఓటంపాలైన భారతీయ రాష్ట్ర సమితి మళ్లీ తెరుకొని ప్రజల్లోకి తొందరలోనే రాగలిగింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంలో మళ్లీ ఆ పార్టీ పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టి రోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక కాడ ప్రజల తరఫున నిలబడి మాట్లాడగలుగుతుంది.
రైతుబంధు మిగులు జలాలు నిరుద్యోగ సమస్య నీటిపారుదల ప్రాజెక్టులు తదితర సమస్యలపై పదునైన విమర్శలతో ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తుంది. గతంలో భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కొరకై తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను నీరు కారుస్తున్నారని అవి కాక 6 గ్యారంటీల పథకాలు విఫలం అవుతున్నాయని ఘాటు గాని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ఈ రకంగా తెలంగాణలో మరియు ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రచారంలో ముందుకేల్లుదామని టిఆర్ఎస్ పార్టీ యూహాలను రచిస్తూ ఉన్నది. మరో పక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్ర రావు ను నియమించిన తర్వాత పంచాయతీ ఎన్నికలు ముంచికలు ఒక అగ్రి పరీక్షగా తీసుకోక తప్పదు. గ్రామాలలో సంస్థ నిర్మాణం లో ఇంకా వెనుకబడిన ఆ పార్టీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి వ్యక్తుల ఇమేజ్తోపాటు కిషన్ రెడ్డి లాంటి నాయకుల సపోర్టు వెన్ను దన్నుతో మున్సిపల్ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకునే దిశలో నిమగ్నమయింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ వర్గాల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వాటి వివరాలను ప్రతి సమావేశంలో సభల్లో ప్రజలకు వివరిస్తూ వస్తున్నది. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఉచిత బస్సు సౌకర్యం 200 యూనిట్ల కరెంటు తదితర పథకాలను ప్రజలను పూర్తిగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా అంతలోనే బొగ్గు నైని కుంభకోణం! సమస్య, మంత్రులపై వచ్చిన ఆరోపణలు సీనియర్లు జూనియర్లు నాయకుల మధ్య వచ్చిన విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారి పార్టీ ప్రతిష్టను బాగా దెబ్బతీశాయి.
దాంతో బొగ్గు నైని బ్లాక్ విషయంలో తెలుగుదేశం పార్టీ ముద్రపడిన మీడియాను తెలంగాణలో ప్రవేశపెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. మళ్లీ తెలంగాణలో ఆంధ్ర రాజకీయాలు ప్రవేశిస్తున్నయేమో అని అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపకపోయినా రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో మాత్రం పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలనే వార్తలు గుప్పుమంటున్నాయి.
ఖమ్మంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పట్ల చేసిన వ్యాఖ్యలు అనుకూలంగా ఉన్నాయని ఆ వ్యాఖ్యల వెనుక ఎలాంటి వ్యూహాలు ఉన్నాయో అన్న అనుమానాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఏది ఏమైనా తెలంగాణలో వంటి చేతుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి అధిష్టానం మద్దతుని ఇవ్వక తప్పదు. కాంగ్రెస్ రాజకీయాలు రేవంత్ కు తెలియనివి ఏమి కొత్త కావు అందుకని రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం క్యాడర్ను కూడా తమ వైపు తిప్పుకొని తమ నాయకత్వాన్ని సుస్థిరత్వం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తున్నది. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ కూడా తెలుగుదేశం పార్టీ లో అనేక సంవత్సరాలు మాజీ మంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు తో కలిసి పనిచేసిన రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పసిగట్టలేనంత అమాయకుడు మాత్రం కెసిఆర్ కాదు అనేది చెప్పొచ్చు.
ఎందుకంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీలో మంచి వ్యూహకర్తగా కూడా తనకు పేరు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలను ఎదుర్కొని ప్రతి వ్యూహాలను పన్నడం కెసిఆర్ కు పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలను భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,హరీష్ రావులు నెత్తిన వేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అనడంలో ఎలాంటి సందేహము లేదు. కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వ వైఫల్యాలపై వారు చేస్తున్న విమర్శలు కేసీఆర్ నూరిపోసిన వ్యూహాలే ఉండి ఉండవచ్చు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబును వ్యక్తిగతంగా మాట్లాడి నిలిపి వేయించాను అన్న రేవంత్ ప్రకటనలు పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా తన వైపే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. దీనికి చంద్రబాబు నాయుడు కూడా ఓకే అన్నట్లుగా ప్రజల్లో ఒక అనుమానాలకు తావిస్తున్నది. మొత్తం మీద రాబోయే మున్సిపల్ ఎన్నికలు రేవంత్ కెసిఆర్ కు మధ్యన బలమైన పోటికి మైదానంగా సిద్ధమవుతున్నాయి. అయితే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీల అధినేతలు కూడా రంగులు మారిన ఒకప్పటి తెలుగుదేశం అగ్ర నేతలే. మరి ఈ మారుతున్న పరిణామాలను టిఆర్ఎస్, బిజెపి ఎంత మేరా తమకు అనుకూలంగా మార్చుకోగలదు వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో తమ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ఆశించిన స్థాయిలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందా ?అసమతి వర్గాలను కలుపుకుంటూ తమ పయనాన్ని కొనసాగిస్తుందా? చూడాల్సిన అవసరం ఉంది.
