ముఖ్యాంశాలు
Kura Yadaiah January,20,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :

రేగొండి తెలంగాణ క్రీడ మైదానంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభిస్తూ గ్రామీణ యువత క్రీడ మైదానాలను ఉపయోగించుకొని క్రీడల్లో తమ ప్రతిభను చాటి చెప్పాలని రేగొండి సర్పంచ్ డి అశోక్ అన్నారు…..
Sports |పెద్దేముల్: గ్రామీణ క్రీడాకారుల ను ప్రోత్సహించడానికి గత ప్రభుత్వం గ్రామాలలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే, ఈ క్రీడ మైదానాలను గ్రామీణ క్రీడాకారులు తమ తమ క్రీడలను ప్రదర్శిస్తూ యువకులు శారీరిక దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోని క్రీడల్లో తమ ప్రతిభను కనపరిచి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలలో తమ ఆటలను కనబరిచి ఆయా గ్రామాలకు పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టేలా యువకులను ప్రోత్సహించేందుకు క్రీడామైధనాలను ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. వాటిని యువకులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు పనులను ప్రారంభిస్తూ వస్తున్నాయి.

రేగొండి లో క్రీడా మైదానంలో పనులను ప్రారంభించిన సర్పంచ్
దాని కొనసాగింపుగా పెద్దేముల్ మండలం రేగొండి గ్రామపంచాయతీ లో ఉన్న తెలంగాణ క్రీడ మైదానాన్ని క్రీడాకారులకు ఎలాంటి అంతరాయం అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకై జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా సర్పంచ్ డి అశోక్ తన అనుచరులు కూలీలతో కలిసి మంగళవారం రోజు పనులను ప్రారంభించారు.
ప్రభుత్వ నిర్ణయం భేష్,
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారుల కోసం ఏర్పాటుచేసిన తెలంగాణ క్రీడ మైదానాలను శుభ్రం చేయడం క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడడం కోసం ప్రభుత్వం పనులను ప్రారంభిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన అంశమేనని అశోక్ అన్నారు. గ్రామీణ క్రీడాకారులు క్రీడా మైదానాలను ఉపయోగించుకొని తమ ఆటల ప్రతిభను చాటుకోవాలని అప్పుడే గ్రామానికి గ్రామ పెద్దలకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెడతాయని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోనేరు మానేప్ప పుల్లమొల్లా బందయ్య, జోగు వెంకటయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ పంజుగుల వెంకటయ్య, టి, మహేశ్ ఖాజ పాషా ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
