23, జిల్లా బీసీ సర్పంచులకు సన్మానం, తాండూర్ బిసి నేత, కందుకూరి రాజ్ కుమార్ అధ్యక్షతన సన్నాహక సమావేశం,

ముఖ్యాంశాలు 

Kura Yadaiah |January 13,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

జనవరి 23న వికారాబాద్ జిల్లా బీసీ సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంగళవారం రోజు తాండూర్ బీసీ సంఘం నేత కందుకూరి రాజ్కుమార్ అధ్యక్షతన సనహక సమావేశం నిర్వహించారు….

తాండూర్ : జనవరి 23న స్థానిక సంస్థల్లో సర్పంచులుగా గెలుపొందిన బీసీ సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘం జిల్లా ప్రతినిధులు గుడిసె లక్ష్మణ్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు యాదగిరి యాదవ్ నర్సింలు తెలిపారు. జనవరి 23 తారీకు రోజున వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ సర్పంచుల సన్మాన కార్యక్రమం సంబంధించి తాండూర్ జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్కుమార్ అధ్యక్షతన తాండూర్ పట్టణంలోని విశాల్ మార్ట్ వద్ద సన్నాహాక సమావేశం మంగళవారం రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ప్రతినిధులు మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గంలో గెలిచిన బీసీ సర్పంచులు తమ అవార్డు సభ్యులతో సహా కార్యక్రమంలో పాల్గొనాలని వీరందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ లైబ్రరీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్ వికారాబాద్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు యాదగిరి యాదవ్ ఎక్స్ ఎంపీపీ కల్కొడ నర్సింలు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు పాండు గౌడ్ జిల్లా బీసీ ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర నాయకులు హాజరై  ప్రసంగించారు.

కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన పట్లోళ్ల నర్సింలు శ్రీనివాస్ చారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ గౌడ్ జర్నలిస్టు శెట్టి రవి గోపాల్ బిజెపి నాయకులు నగరం మల్లేశం మంతన్ గౌడ్ రాజు పూజారి పాండు సత్యనారాయణ పర్యాద రామకృష్ణ అరుణ్ రాజ్ వీరప్ప నరేందర్ యాల టి శ్రీనివాస్ సర్పంచులు భార్గవి ,బసంత్ కుమార్ నరసమ్మ మంజుల విజయలక్ష్మి శ్రీశైలం ప్రభు శంకర్ రాము ముదిరాజ్ దుబాయ్ వెంకట్ పరమేష్ గోపాల్ టైలర్ రమేష్ అనిల్ రాహుల్ వినయ్ తదితరులు పాల్గొన్నారు

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *