15,000, పెన్షన్ తో మళ్ళీ కలుస్తా, తీవ్ర వైకల్యం గల దివ్యాంగులకు హామీ ఇచ్చిన, మంత్రి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్,

దివ్యాంగులు, అభివృద్ధి,

Kura Yadaiah| January 12,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :- 

రాష్ట్రంలో తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు 15000 పెన్షన్ పెంపు విధానంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని త్వరలో పెన్షన్ పెంపుతో మళ్లీ తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులను కలుస్తానని, దివ్యాంగులు వయోవృద్ధుల మరియు ఎస్సీ ఎస్టీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ దివ్యాంగులకు హామీ ఇచ్చారు…….

Minister adluri Lakshman Kumar|హైదరాబాద్ :  రాష్ట్రంలో తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు 15,000 పెన్షన్ పెంపుతో మళ్లీ కలుస్తానని దివ్యాంగులు వయోవృద్ధుల ట్రాన్స్ జెండర్స్ మరియు ఎస్సీ ఎస్టీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో తీవ్ర వైకల్యం గల దివ్యాంగుల ప్రత్యేక సమావేశంలో ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

దివ్యాంగుల జీవన పరిస్థితులు అవగాహన ఉన్నాయి,

దివ్యాంగుల జీవన పరిస్థితులు తనకు పూర్తిగా అవగాహనలో ఉన్నాయని అధిక మద్దతు అవసరం ఉన్న దివ్యాంగులకు ప్రత్యేక క్యాంపు ల ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో 15,000 మందిని గుర్తించామని ప్రభుత్వానికి కొద్దిగా సమయం ఇస్తే ముఖ్యమంత్రి గారిని సంప్రదించి తీవ్ర వైకల్య వికలాంగులకు పెన్షన్ పెంపు పై సానుకూల నిర్ణయం కోసం ప్రయత్నిస్తానని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంలోనే మంత్రి దివ్యాంగుల శాఖ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ తో తీవ్ర వైకల్యం గల దివ్యాంగుల పెన్షన్ అంశాన్ని పెన్షన్ కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పైల్ ను తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.

తమ గోడును వినిపించుకున్న దివ్యాంగుల సంఘాలు,

అయితే తీవ్ర వైకల్యం గల దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వెన్న ముక్క గాయాలు కండర క్షీణిత లాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తులు జీవితాంతం సంరక్షకులపై ఆధారపడాల్సి వస్తున్నదని ప్రస్తుత పెన్షన్ వైద్య ఖర్చులు పిజియోతెరపి డైపర్స్ సహాయక పరికరాలు కేర్ టేకర్ వ్యాయాలకు ఏమాత్రం సరిపోవటం లేదని వెన్నెముక గాయ దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి షఫీ తెలంగాణ కండరాక్షినీత దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ వెంకట్రెడ్డిలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందని తెలిపారు. దివ్యాంగులకు హైదరాబాదులోనే ప్రత్యేక పునరావాస కేంద్రం ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ డి ఇండియా జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్ రాష్ట్ర అధ్యక్షులు ధైర్యంపల్లి మల్లికార్జున్ ఉపాధ్యక్షులు శివకుమార్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ సిడిఎస్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి జూపల్లి సోమేశ్వరరావు సాయి కుమార్ బాలరాజు మహేందర్ గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావులతో పాటు వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *