Oplus_131072

స్థానిక పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ చివరి రోజు , తాండూర్ నియోజకవర్గంలో జోరందుకున్నా నామినేషన్ల ప్రక్రియ,

ఎన్నికలు 

Kura yadaiah| November 29,2025,

హిందు 9న్యూస్ బ్యూరో :-

Election update|గ్రామపంచాయతీ స్థానిక ఎన్నికలకు చివరి రోజు నామినేషన్ ప్రక్రియ కావడంతో పెద్దేముల్ మడలంలో నామినేషన్ ప్రక్రియ జ్వరం అందుకుంది…

Election update|( తాండూర్)  స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ శనివారం చివరి రోజు కావడంతో వివిధ పార్టీలు బలపరిచిన అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ జోరు అందుకుంది.  ఏ ఎన్నికల క్లస్టర్ వద్ద చూసిన నాయకులతో కార్యకర్తలతో ప్రజలతో  కోలాహలంగా మారింది. ఇటు బి ఆర్ ఎస్ అటూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతో పాటు  బిజెపి నాయకుల కార్యకర్తల హడావిడి కనిపిస్తున్నది.  స్థానిక నాయకులు నువ్వా నేనా అన్నట్టుగా పంచాయతీ ఎన్నికల్లో పోటీతత్వం పెరిగింది. నియోజకవర్గం వారిగా  అక్కడ  అక్కడ గ్రామాల్లో ఇప్పటికే ఏకగ్రీవం కావడం సంచలనాన్ని కూడా కలిగించింది. నేటితో నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో స్కూటీని  విడ్రాలు మిగిలి ఉన్నాయి. స్కూట్ని నీలో రికార్డు సక్రమంగా లేకపోయినా అట్టి అప్లికేషన్ను తిరస్కరించే అవకాశాలుంటాయి. ఈ క్రమంలోనే తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ,బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  బిజెపి రాష్ట్ర నాయకులు యు, రమేష్ కుమార్ తో పాటు క్రింది స్థాయి నాయకత్వం ఆయా గ్రామాల పర్యటనలు చేస్తూ  తమ పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు ప్రోత్సహిస్తూ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతూ ముందుకు కదులుతున్నారు. స్థానిక  గ్రామాలలో తమ పార్టీ బలబలాలను స్థానిక నాయకులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మొదటి విడత ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సందర్భంలో స్థానికంగా నాయకులు బుజ్జగించడం ఆ పార్టీలో నుండి ఈ పార్టీలోకి ఈ పార్టీలో నుండి  అ పార్టీలోకి పార్టీలు మారడం, పై స్థాయి నాయకత్వంతో మాట్లాడి  అలిగిన క్యాడర్ను ఆది నాయకత్వాలతో బుజ్జగించే పర్వం మొదలైంది. తాండూరు నియోజకవర్గం లో అధికార పార్టీ కే, ఎక్కువ సర్పంచ్ స్థానాలు వస్తాయని లేదు లేదు బిఆర్ఎస్ పార్టీకే అధిక స్థానాలు వస్తా యని ఆయా పార్టీల అధినాయకత్వం వ్యక్తం చేస్తు వస్తున్నాయి. మరోపక్క బీజేపీ నియోజకవర్గం 20 నుండి 25 సర్పంచ్ స్థా నాలు గెలుచుకునే దిశగా పయనిస్తుందని బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారులు ఎన్నికల సందర్భంగా పూర్తిస్థాయి బందోబస్తులను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. క్లస్టర్లలో పోలీసులతో నిఘాను ఏర్పాటు చేశారు.స్కూట్ని ముగింపు తర్వాత 11 తారీఖు రోజు ఎన్నికలే తరువాయి. అదే రోజు పోలింగ్ అదే రోజు ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు.

 

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *