వేడుకలు
Kura Yadaiah December 30,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

నూతన సంవత్సర వేడుకల వేల వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే నాయకులు ప్రజలు అధికారులు ఎవరైనా ష్పగుచ్చాలు శాలువాలు తీసుకురావద్దని అదే పేద విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాల్లో పెన్సిళ్లు పెన్నులు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ కోరారు….
వికారాబాద్ జిల్లా :- నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి జిల్లాలోని నాయకులు ప్రజలు అధికారులు వచ్చేటప్పుడు పుష్పగుచ్చాలు బొకేలు శాలువాలు తీసుకురావద్దని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ వేడుకల సందర్భంగా పిలుపునిచ్చారు.
పేద విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తీసుకురండి,
వాటికి బదులుగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అధికారులు ప్రజలు నాయకులు ఎవరైనా విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు లేదా ఇతర దుప్పట్లు ఇతర సామాగ్రి తీసుకొచ్చి శుభాకాంక్షలు తెలపాలని ఆయన కోరారు.

వాటిని జిల్లాలోని పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చూడొచ్చని విద్యార్థుల చదువులకు సహాయపడతాయని అలాగే చలికాలం ఉండడం వల్ల దుప్పట్లు కూడా ఇవ్వడం వల్ల వాటిని కూడా పేద విద్యార్థులకు అందించవచ్చని పేద విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇదొక మంచి మార్గమని ఆయన సూచించారు. ఏది ఏమైనా విద్యార్థులకు సహాయపడే వస్తువులను ఇవ్వాలని మరోసారి కలెక్టర్ కోరారు.
