ఎన్నికలు
Kura Yadaiah| November 22,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

Election| తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఈ నెల 26న ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించనున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి…..
Election|రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. గతంలో కోర్ట్ కేసు వల్ల ఎన్నికలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే అయితే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామపంచాయతీలకు వచ్చే నిధులు కూడా వస్తాయని ఆలోచనతో ప్రభుత్వం ఉంది. గ్రామాల అభివృద్ధి ఇప్పటికే కొంటుబడి అభివృద్ధి నిలిచిపోయిన సంగతి ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. ఈ నేపథ్యంలోని తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలను డిసెంబర్ 20 తారీకు లోపు పూర్తి ఎన్నికలు నిర్వహించాలని ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.
ఈనెల 26న ఎన్నికల నోటిఫికేషన్!
ఆ దిశలోనే ఈనెల 26న సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 11 ,14,17, తేదీలలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పాత రిజర్వేషన్లతోని సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. సోమవారం రోజున గ్రామాల వారీగా రిజర్వేషన్ల రోస్టర్ విడుదలకు రంగ సిద్ధం సిద్ధమయింది. ఏది ఏమైనా పరితగత్తున్నా ఎన్నికలు నిర్వహించి తర్వాత మునిసిపాలిటీ జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించే ఆలోచనకు ప్రభుత్వం వస్తున్నట్లు తెలుస్తుంది.
