దేశం, రాజకీయం
K, yadaiah |August 19,2025,
Hindu 9 news :

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని అధికారికంగా ఏఐసీసీ ప్రకటించింది.
India kutumi| డిల్లీ :ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ బి, సుదర్శన్ రెడ్డిని అధికారికంగా ఇండియా కూటమి ప్రకటించింది. సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ మంగళవారం రోజు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం కావడం విశేషం. వ్యవసాయం కుటుంబంలో పుట్టిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఇండియా కూటమి తరపున అభ్యర్థిగా నియమించినందుకు ఆనందంగా ఉందని, అందరినీ కలిసి తాను మద్దతు కోరుతానని మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
https://youtu.be/1JI6GOgHmOg?si=SUixUbcAjRzQ2PqA
జస్టిస్ పదవి విరమణ తర్వాత గోవా లోకయుక్త చైర్మన్గా చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా ఎన్నిక కావడం హర్షించదగ్గ విషయమని పలువురు తెలంగాణ మేధావులు సామాజిక వ్యక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ ఉపరాష్ట్రపతి బరిలో సిసి రాధాకృష్ణ, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు.
