వ్యవసాయం,
Kura Yadaiah|September 28,2025,


Farmer/ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయారు చేతికి అందిన పంటలు వర్షంలో వాగుల్లో కొట్టుకుపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు……
Farmer/ హిందు 9 న్యూస్ (పెద్దేముల్): ఈమధ్య వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గురు శుక్ర శనివారాలలో కురిసిన భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని ఆవేదనను దుఃఖాన్ని మిగిల్చాయి. కొద్ది రోజులు నిలబడి ఉంటే రైతుల చేతికి అంది పంటలు పూర్తిగా వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి వాగులు వంతల్లో చేతికి అందిన పంటలు కొట్టుకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దాంట్లో భాగంగానే వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన పాండు, అశోక్(మొగులయ్య కుమారుడు )అనే రైతులకు సంబంధించిన వరి పంట పత్తి పంటలు మన్సాన్పల్లి పెద్దవాగు పొంగడంతో పంటలు పూర్తిగా నీట మునిగి వాగులో కొట్టుకపోయాయని రైతులు పాండు , అశోక్ లు తెలిపారు.
*మమ్మల్ని ఆదుకోండి -పంట నష్ట రైతుల ఆవేదన,


వాగులో కొట్టుకుపోయిన వరి పంట దృశ్యం
అశోక్ సంబంధించిన అందాజ 2 ఎకరాల వరి పంట, పాండు 3, ఎకరాల వరి, రెండు ఎకరాల పత్తి పంట దాదాపుగా వాగు వరదల్లో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా కొన్ని రోజుల్లో ఆగి ఉంటే పత్తి వరి చేతికి అంది వచ్చేవని పంటలని చేతికొచ్చిన పంటలు పోవడం వల్ల మాకు తీవ్ర నష్టం వాటిల్లిందని అప్పులు చేసి లాగోడిపెట్టి పంటలు పండించుకుంటే అకాల వర్షాలు మమ్మల్ని పూర్తిగా ముంచాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించి ప్రభుత్వానికి నివేదించాలని అలాగే ప్రభుత్వం నుండి తమకు సహాయ సహకారాలు అందివ్వాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. లేకుంటే తెచ్చిన అప్పులే కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఏర్పడుతుందని ఓకింత బాధను వెళ్లిబుచ్చారు.
