హత్య చేసి పరారైన నిందితుడు, మూడేళ్ల కేసును చేదించిన తాండూర్ పోలీసులు,

క్రైం

kura Yadaiah |October 19,2025,

హిందు 9న్యూస్ డెస్క్ :

తాండూర్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంచన్ పల్లి కి చెందిన రవి అనే వ్యక్తిని హత్య చేసి పరారీలో ఉన్న బాలాజీ ని ఎట్టకేలకు తాండూర్ పోలీసులు అరెస్టు చేసి శనివారం రోజు రిమాండ్ కు తరలించారు. ఈ హత్య కు సంబంధించిన వివరాలను తాండూర్ డిఎస్పి బాలకృష్ణారెడ్డి తాండూర్ రూరల్ సీఎం నాగేష్ పెద్దేముల్ ఎస్సై వేణు కుమార్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. దాదాపుగా మూడేళ్ల క్రితం 2023 సంవత్సరంలో మంచన్ పల్లి కి చెందిన రవి అనే వ్యక్తి వద్ద బాలాజీ అనే సదరు వ్యక్తి రెండువేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు.

ఆ అప్పు పైసలు తిరిగి ఇవ్వాలని రవి కోరగా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో బాలాజీ అనే వ్యక్తి కత్తితో రవిని పొడిచి అక్కడి నుండి పరారయ్యారు. అయితే రవి కుటుంబ సభ్యులు తమ్ముడు గోపాల్ అప్పట్లో హత్య విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో తాండూర్ డిఎస్పీగా ఉన్న శేఖర్ గౌడ్ ఫిర్యాదును స్వీకరించి కేసు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న బాలాజీ తన సొంత గ్రామమైన నిజాంబాద్ జిల్లా మదునూరు గ్రామానికి వెళ్ళిపోయారు. పరారైన నిందితుడుని పట్టుకోవడానికి పోలీసులు స్పెషల్ టీమును కూడా పంపిస్తే చిక్కలేదు. అయితే నిందితుడు ఎలాంటి ఫోన్ వాడక పోవడం ఇంటికి కూడా రాకపోవడంతో అప్పట్లో దొరకపోవడం పోలీసులు పరిశోధనలో భాగంగా గట్టిగా నిఘా పెట్టి బాలాజీ కదలికలు ఎప్పటికప్పుడు పోలీసులు తెలుసుకోవడం ఇంటి సభ్యులను వారి కలలికలపై కూడా నిఘా బెట్టడంతో పోలీసులకు గట్టి సమాచారం దొరికింది.అయితే సిద్దిపేటలో తన తమ్ముని వద్ద పోలీసులు చాకచక్యంతో నిందితుడు బాలాజీని పట్టుకోవడం జరిగింది. నిందితుడిని తాండూర్ కు తరలించి పూర్తిస్థాయిలో విచారించి డిఎస్పి బాలకృష్ణారెడ్డి, సిఐ నాగేష్, పెద్దేముల్ ఎస్సై వేణు కుమార్ ఆధ్వర్యంలో వివరాలను వెల్లడించారు. నిందితుడిని మూడేళ్ల తర్వాత చాకచక్యంతో తాండూర్ కు సంబంధించిన స్పెషల్స్ టీం పోలీసులు శివకుమార్ అంజాద్ మున్నయ్యలు పట్టుకోవడంతో తాండూర్ డిఎస్పి సీఐ వారిని అభినందించారు. చట్టం దృష్టిలో ఎవరు కూడా ఎన్ని రోజులైనా నేరం చేసి తప్పించుకోలేరనే విషయాన్ని సదరు తాండూర్ పోలీసులు నిరూపించారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *