క్రైమ్
Kura Yadaiah| November 3,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :


Accident| సోమవారం ఉదయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలోని మిర్జాగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాల ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.కంకర ఓవర్ లోడ్ స్పీడుతో టిప్పర్ దూసుకు రావడంతోనే ప్రమాదం జరిగిందని గుర్తించిన అధికారులు.
చెవేళ్ళ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని మిర్జాగూడ ప్రాంతంలో సోమవారం జరిగిన బస్సు ప్రమాద సంఘటనకు సంబంధించి అనేక అంశాలు బయటపడుతున్నాయి. కంకర ఓవర్ లోడు స్పీడుతో వచ్చిన టిప్పర్ తాండూర్ నుండి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీ కొంటడంవల్లనే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని ప్రధాని కారణమని అధికారులు గుర్తించారు.అంతంత మాత్రంగా ఉన్న హైదరాబాద్ మన్నెగూడ తాండూర్ ప్రధాన రోడ్డు అనేక సంవత్సరాలుగా పెద్ద పెద్ద గుంతలతో దర్శనమిస్తుండటం ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలకు ఘటనలకు కారణమవుతున్నాయని బాధితులు ప్రజలు ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు .హైదరాబాదు నుండి మన్నెగూడ వరకు రోడ్డు ఇరుకుగా ఉండడంతో రెండు వాహనాలు పాస్ అవడం చాలా ఇబ్బందిగా ఉందని డ్రైవర్లు అనేకసార్లు ఆరోపించారు. మన్నెగూడ నుండి హైదరాబాద్ వరకు చాలా ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ఓవర్ లోడ్ తో వస్తున్నటువంటి లారీలు టిప్పర్లు కానీ మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని బలంగా స్థానికులు ప్రజలు ఆరోపించారు.
-రోడ్డు వెడల్పు విషయంలో గత పాలకులు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలు,
రోడ్డు వెడల్పు విషయంలో గతంలో ఉన్న ప్రభుత్వం స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్లే దీనికి ప్రధాన కారణమని బాధ్యత కుటుంబాలు ప్రజల నుండి ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమయ్యాయి.సోమవారం రోజు జరిగిన టిప్పర్ ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలు ఓవర్ లోడ్ తో వస్తున్న టిప్పర్ బస్సును ఢీకొనడంతో టిప్పర్ మొత్తం బస్సు పై పడటంతో టిప్పర్ లో ఉన్న కంకర మొత్తం ప్రయాణికులపై పడడం పెద్ద ప్రాణనష్ఠానికి కారణమైనట్లుగా గుర్తించారు. టిప్పర్ లో వెళ్తున్న కంకరపై టార్పలిన్ కవర్ కూడా కప్పకపోవడం కూడా చిత్రమైన అంశమే, బస్సులో ఉన్న ప్రయాణికులపై టిప్పర్ లో ఉన్న కంకర పెద్ద మొత్తంలో కప్పుకపడడంతో మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు స్థానికులు చెప్తున్నారు. మరోపక్క బస్సులో ప్రయాణించాల్సిన సంఖ్యకు మించి ప్రయాణికులు ఉండడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందని తెలుస్తుంది. 54 మందికి గాను 70 మంది ప్రయాణికులు ఎక్కడంతో మృతుల సంఖ్య అధికంగా పెరిగినట్లు గుర్తించారు. ఇందులో ఎంతోమంది అభాగ్యులు తమ అమూల్యమైన ప్రాణాలను నిండు నూరేళ్లు బతకాల్సిన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. తల్లిదండ్రులు పోయి పిల్లలు బతకడం, పిల్లలు చనిపోయి తల్లిదండ్రులు తీరని దుఃఖంలోకి వెళ్లడం లోకాన్ని మొత్తం నివ్వరపోయేలా చేసింది. అనాధలుగా మారిన చిన్నారులు పిల్లలను కోల్పోయి తీరని దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు.

మరోపక్క గాయాల పాలై శరీర అవయవాలు తెగి అహంకారాలు చేస్తూ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. అనేకమంది పీడిత తాడిత పేదల చావుకు ఓవర్ లోడ్ తో వస్తున్న టిప్పరే ప్రధాన కారణమని పరిస్థితులను కారణాలను అధికారులు చెబుతున్న మాటలను బట్టి అర్థమవుతున్నది. జరిగిన సంఘటనను చూస్తే ఎంత ఘోర ప్రమాదమో ప్రభుత్వాలు ఒక్కసారి మేల్కొలాల్సిన అవసరం చాలానే ఉంది. గతంలో ఆలూరులో కూలినాలి చేసుకొని కూరగాయలు అమ్ముకుంటున్న రైతులపైకి లారీ దూసుకెళ్లి అనేకమంది ఆరోజు ప్రాణాలు వదిలారు. ఇప్పుడు చదువుకుందామని ప్రయాణించిన పిల్లలు ఎందరో ,చుట్టపు సూపుగా పెండ్లికి వచ్చిన అభాగ్యులేందరో, అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వెళుతున్న ఎంతోమంది ఎంతమంది పేదలో, ఈ బస్సు ప్రమాద ఘటనలో చనిపోయారు. దీన్నెంతటికి ప్రధానమైన కారణం ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చే ఉచిత పథకాలను పక్కకు పెట్టి ఒక రెండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రోడ్లను పూర్తిస్థాయిలో వెడల్పు చేసి ఉన్న బడ్జెట్ ను వాటి కి కేటాయించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తక్షణ కర్తవ్యం గా తీసుకోవాలని బలంగా ఆరోపణలు ఉన్నాయి. వేరే వేరే పథకాలు ను పక్కకు పెడితే వాటి నుండి వచ్చేది కాదు పోయేది కాదు కానీ ప్రజలు ముందు బతకాలి ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయాలంటే రోడ్లు బాగుండాలి ఇవి ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్య ,

-ఓవర్ లోడుతో రోడ్లపై తిరుగుతున్న టిప్పర్లపై లారీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి,డిమాండ్ చేసిన, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు,
మరో కారణం ఇప్పటికే రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలలో టిప్పర్లు ఓవర్ కంకర్ లోడులతో రోడ్లను పాడు చేస్తున్నాయని లారీలు కూడా అదే లోడుతో మెయిన్ రోడ్లను పూర్తిగా గుంతల మయం చేస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు చాలాసార్లు ఆరోపించాయి. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికీ టిప్పర్లు కంకర రోడ్లతో వచ్చిరాని డ్రైవింగ్ తో రోడ్లపై సరైన అవగాహన లేక వచ్చి పోయే ప్రయాణికులను చూడకుండా అతి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.అలా చేయడంవల్లనే అనేకమంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని కుటుంబాలకు తీరని ఆవేదను బాధలను దుుఃఖాలను మిగిలిస్తున్నారని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ వికారాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి వై మహేందర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ లాంటి నేతలు మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా ఓవర్ లోడ్ తో వెళుతున్న టిప్పర్లపై లారీలపై కఠినమైన చర్యలు తీసుకొని ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించాల్సిన బాధ్యత మైనింగ్ రోడ్ సేఫ్టీ ట్రాన్స్పోర్ట్ అధికారులదేనని మహేందర్ రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. కంకర ఇతర ఓవర్ లోడ్లతో టిప్పర్లు గాని లారీలు కానీ తిరిగితే ప్రజలు ఇంకా ఘోర ప్రమాదాలు చూడాల్సి వస్తుందని దీనికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇలాంటి ఓవర్లో్ లోడ్ తో వెళుతున్న యాజమాన్యాలపై డ్రైవర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వాలకు అధికారులకు మంచి పేరు వస్తుంది తప్ప వేరే కాదని గుర్తు చేశారు. ప్రజల ప్ణాలు చాలా విలువైన ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యం ప్రజల ప్రాణాలను కాపాడడమేనని ప్రజలు బ్రతికుండడం కావాలి ప్రజలు నిండు నూరేళ్లు బ్రతకాలని ప్రభుత్వాలు స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు ఆకాంక్షించాలి అలా జరగాలంటే మీర్జాపూర్ లాంటి ఘోర దుర్ఘటనలు జరగకూడదు జరగకూడదు అంటే రోడ్లు పూర్తిస్థాయిలో మంచిి ఉండాలని ప్రభుత్వం మరో ఆలోచన చేయకుండా బడ్జెట్ను్ కేటాయించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.
–ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి పెద్ద రోడ్డు ప్రమాద ఘటనలు జరగడానికి కారణం రోడ్డు వెడల్పు లేకపోవడమే!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి పెద్ద సంఘటనలు ఆలూర్ యబ్బనూరు ఇప్పుడు మీర్జాపూర్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలలో అనేకమంది నిరుపేద కూలీలు పేద ప్రజలు చనిపోయి వారి కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడదని కూడా ప్రజల్లో ఒక చర్చనీ అంశం జోరుగా సాగుతున్నది. దీనంతటికీ అధికారులు కారణమని ఆరోపణలు ఉన్నాయి.
మరీ వికారాబాద్ జిల్లాలో ఒకపక్క ఘోరా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే కంకరలోడుతో టిప్పర్లు రోడ్లపై ప్రయాణిస్తుంటే రోడ్ సేఫ్టీ అధికారులు మైనింగ్ అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకున్న సందర్భాలు ఎక్కడా కనిపించవని ప్రజల నుండి బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వికారాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఓవర్ లోడ్ తో వెళుతున్న టిప్పర్ల పై యజమాన్యంపై డ్రైవర్లపై లారీ డ్రైవర్ల పై లారీ యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ప్రమాదాలను అరికట్టలేమని దీనికి అధికారులే ప్రధానంగా ముందు ఉండాల్సిన అంశమని అధికారులు ఇలానే నిర్లక్ష్యం వహిస్తే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తాయని రోజుకు ఒక్క సంఘటన జరిగితే ప్రభుత్వాలు జరిగిన తర్వాత స్పందించడం మానేసి అధికారులను అప్రమత్తం చేసి ఓవర్ లోడ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాల్సిన అవసరం ఉందని పిడిఎస్యు లాంటి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి . మిర్జాగూడ రోడ్డు ప్రమాద బాధితులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పరామర్శించాడానికి వచ్చిన మిగతా నేతలు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య లపై బాధితులు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. రోడ్డు వెడల్పు కాకపోవడానికి కారణం వీరేనంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తాండూర్ నుండి వికారాబాద్, వికారాబాద్ నుండి హైదరాబాద్ రోడ్డును వెడల్పు చేసి ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన ప్రయాణాన్ని ముందుగా కల్పించాలని ప్రజలు బతికుంటేనే కదా ఏదైనా చేసుకోగలిగేది అంటూ బాధ్యతలు ఆవేదనను వ్యక్తం చేస్తూనే డిమాండ్ చేశారు.
